India vs England Series Postpone: ఇంగ్లాండ్ తో భారత్ సిరీస్లు వాయిదా!

India vs England Series Postpone: కరోనా వైరస్ వలన నష్టపోయిన రంగాల్లోకి క్రీడారంగం ఒకటి..

Update: 2020-07-15 11:45 GMT
Team India (File Photo)

India vs England Series Postpone: కరోనా వైరస్ వలన నష్టపోయిన రంగాల్లోకి క్రీడారంగం ఒకటి.. పలు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీసులు రద్దు అయిపోయాయి.. ఇక క్రికెట్ ఫాన్స్ ఎంతో ఎదురు చూస్తున్న ఐపీఎల్ కూడా వాయిదా పడింది.. అయితే ఐపీఎల్ జరగకుండా ఈ సంవత్సరం ముగియదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు. ఇక ఇది ఇలా ఉంటే సెప్టెంబర్లో భారత్లో ఇంగ్లాండ్ పర్యటన జరగాల్సి ఉంది. భారత జట్టు తో ఇంగ్లాండ్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. కానీ దేశంలో కరోనా తీవ్రత ఏ మాత్రం కూడా తగ్గకపోవడంతో ఈ పర్యటనను వాయిదా వేస్తున్నట్టుగా బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి బుధవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

" సెప్టెంబర్లో భారత్తో ఇంగ్లాండ్ తో ఆరు మ్యాచ్లు(3వన్డేలు, మూడు టీ20లు)ఆడాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల వల్ల ఇంగ్లిష్జట్టు.. భారత్కు వచ్చే అవకాశాలు లేవు" కావున దీనిని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టుగా అయన వెల్లడించారు. ఇక భారత క్రికెట్ జట్టు భవిష్యత్ పర్యటనలు, కార్యాచరణ క్యాలెండర్పై చర్చించేందుకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం సమావేశం కానుంది. కరోనా తరవాత భారత ఆటగాళ్ళు పూర్తిగా ఆటకు దూరం అయ్యారు.

ఆలస్యంగా ఆసీస్ టూర్ :

ఈ ఏడాది చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ భారత జట్టు ఆసీస్ జట్టుతో మూడు టీ20, నాలుగు టెస్టులు, 3 వన్డేల సిరీ‌స్ లను ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వారం రోజులు ఆలస్యంగా జరిగే అవకాశాలున్నాయి. ఇక, టెస్టులకన్నా ముందు జరిగే టీ20 సిరీసను రద్దు చేయడమో లేక మ్యాచ్‌లను తగ్గించడమో జరుగనుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

Tags:    

Similar News