India vs England 1st Test: ముగిసిన మూడో రోజు ఆట.. భారత్‌కు ఆధిక్యం రావాలంటే
చెపాక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్నతొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది.
చెపాక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్నతొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. మెదటి రెండు రోజుల మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు భారత్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఇంగ్లాండ్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొవడంతో టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైంది. ఛెతేశ్వర్ పుజారా(73; 143 బంతుల్లో 11x4), రిషభ్ పంత్(91; 88 బంతుల్లో 9x4, 5x6) అర్ధశతకాలు సాధించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 74 ఓవర్లలో 6 వికెట్లు పడగొట్టి 257 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెస్ నాలుగు వికెట్లతో సత్తాచటగా.. ఆర్చర్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 555/8 తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లాండ్.. 23 పరుగులు చేసి 578 పరుగులకు ఆలౌటైంది. బెస్ (34)తో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా (3) వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. అశ్విన్ (3) క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(6) పరుగులకు ఆదిలోనే ఔటయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్‌గిల్(29) ధాటిగా ఆడుతూ ఆర్చర్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. టీమిండియా 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ(11) నిరాశపరచగా.. రహానె(1) పరుగుల చేయడానికి ఇబ్బంది పడ్డాడు. పుజారా, పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఆర్థసెంచరీలు పూర్తి చేశారు.
ఈ క్రమంలో పంత్ ధాటిగా ఆడతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇరువురు కలిసి ఐదో వికెట్ కు 119 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో పుజారా బెస్ బౌలింగ్ లో బర్నకు క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. వెంటను పంత్ సెంచరీకి చెరువలో వికెట్ జారవీడుచుకున్నాడు. జట్టు స్కోరు 225 పరుగుల వద్ద పంత్ అవుట్ కావడంలో భారత్ సుందర్, అశ్విన్ కీజులలో ఉన్నారు. ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తా పడ్డారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 321 పరుగుల వెనుకపడి ఉంది.