India vs England 1st Test: ఆఖరి రోజు చేతులేస్తారా? మరోసారి చరిత్ర సృష్టిస్తారా?
తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగుల ఆధిక్యం లభించడంతో ఇంగ్లాండ్ టీమిండియాకు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. నాలుగు రోజు భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఇంగ్లాండ్ ను రెండో ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకే పరిమితం చేశారు. టీమిండియా పేస్ ధాటికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ (40 32బంతుల్లో, 7 ఫోర్ల)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ తన స్పిన్ మాయాజాలం చూపించాడు. సెంకడ్ ఇన్నింగ్స్ లో అశ్విన్ వికెట్ల వేట ప్రారంబించాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లతో అదగొట్టాడు. నదీమ్ 2, ఇషాంత్, బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగుల ఆధిక్యం లభించడంతో ఇంగ్లాండ్ టీమిండియాకు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 25 పరుగులకే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఓపెనర్ శుభమన్ గిల్ (15), పుజారా(12) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు భారత్ విజయం సాధించాలంటే 381 పరుగలు చేయాలి. చేతిలో 9వికెట్లు ఉన్నాయి.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 257 పరుగులతో నాలుగోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఆ స్కోరుకు 80 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఏడో వికెట్‌కు వాషింగ్టన్ సుందర్ (85 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్(31) ఏడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, ఈ జంటను జాక్ లీచ్ విడదీశాడు.