ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు రోహిత్, ఇషాంత్ అనుమానమే

Update: 2020-11-24 16:30 GMT

టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం అనుమానమేనా ? అందుకే శ్రేయస్‌ను అక్కడే ఉండమని చెప్పారా? అసలు ఏం జరుగుతోంది ? మళ్లీ ఎందుకు పక్కనపెడుతున్నారు ? రోహిత్ శర్మ వెనక రాజకీయం నడుస్తోందా ? అభిమానుల్లో వినిపిస్తోన్న కొత్త చర్చ ఏంటి ?

రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఎప్పుడూ లేని గండాన్ని ఎదుర్కుంటున్నాడేమో అనిపిస్తోంది పరిస్థితులు చూస్తుంటే ! గాయం కారణంగా ఆస్ట్రేలియా టూర్ నుంచి పక్కనపెట్టినట్లు బీసీసీఐ ప్రకటించగానే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు ! ఐతే ఒక టెస్ట్ ఆడిన తర్వాత విరాట్ కోహ్లీ వెనక్కి వస్తాడని చెప్పిన బీసీసీఐ ఆ తర్వాత మళ్లీ రోహిత్ శర్మకు అవకాశం కల్పించింది. చాన్స్ ఇస్తే ఇచ్చింది కానీ సాహాలాంటి వాళ్లు దుబాయ్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్తే రోహిత్‌ను మాత్రం ఇండియాకు పంపించింది. బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీలో హిట్ మ్యాన్ ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

రోహిత్ వ్యవహారంలో చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడో వార్త అభిమానులకు మరింత కోపం తెప్పిస్తోంది. ఈ నెల 27నుంచి ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభం కానుండగా భారత్ 3 వన్డేలు,3 టీ20లు, 4టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 17 నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ కానుంది. ఐతే టెస్ట్ సిరీస్‌కు రోహిత్‌తో పాటు ఇషాంత్ ఆడటం అనుమానంగా మారిందిప్పుడు ! ప్రస్తుతం ఈ ఇద్దరి ఫిట్‌నెస్‌పై ఎలాంటి పురోగతి కనిపించడం లేదని సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

ఆస్ట్రేలియా వెళ్లాక 14రోజులు క్వారంటైన్ ఉండాల్సి ఉంటుంది. ఐతే ఇదంతా జరగాలంటే వచ్చే రెండు మూడు రోజుల్లో ఈ ఇద్దరు ఫిట్‌నెస్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా జరగకపోతే ఆస్ట్రేలియా పర్యటనకు ఇద్దరు దాదాపు అనుమానేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయ్ కాబట్టే వన్డే సిరీస్‌కు ఎంపికైన శ్రేయస్ అయ్యర్‌ను ఆస్ట్రేలియాలోనే ఉంచాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిణామాలు అన్నింటిని చూస్తుంటే ఆస్ట్రేలియా సిరీస్‌కు రోహిత్ డౌటేనన్న చర్చ అభిమానుల్లో జరుగుతోంది.

ఐతే బోర్డు తీరుపై అభిమానుల విమర్శలు ఆగడం లేదు. కావాలని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఫిట్‌గా ఉన్నానని రోహిత్ చెప్తున్నా బోర్డు ఇలా ఎందుకు చేస్తోందని నిలదీస్తున్నారు. హిట్ మ్యాన్ విషయంలో ఎందుకు సరైన ప్రకటన చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. 

Tags:    

Similar News