ఎట్టకేలకు జట్టుతో రోహిత్‌.. మూడో టెస్టుకు డౌటే !

Update: 2020-12-30 11:09 GMT

టీమిండియా సీనియర్ క్రికెటర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నేడు భారత జట్టుతో కలవనున్నాడు. ఆస్ట్రేలియాలో చివరి రెండు టెస్టులు ఆడేందుకు కావాల్సిన లాంఛనాలన్నీ పూర్తి చేసుకున్నాడు. క్వారంటైన్‌ ముగిసిన అనంతరం మెల్‌బోర్న్‌లో టీమిండియా జట్టుతో కలవనున్నాడు. రోహిత్ శర్మ రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చిన అతను కఠిన క్వారంటైన్‌ నిబంధనలను పాటించాల్సి వచ్చింది. ఏడాది నిర్వహించిన ఐపీఎల్‌లో గాయమైన నాటినుంచి రోహిత్ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడం పలు వివాదాలకు దారీ తీసింది. అయితే వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సెలక్షన్ కమిటీ అతన్ని టెస్టు సిరీస్ కు ఎంపిక చేశారు.

ఇక ఆస్ట్రేలియాలో పర్యటించిన రోహిత్ ఫిట్‌నెస్‌ పరీక్షల అనంతరం బుధవారం సహచరులతో కలిసిన తర్వాత అతను సాధన ప్రారంభించే అవకాశం ఉంది. రోహిత్ పునరాగమనంపై కోచ్ రవిశాస్త్రీ స్పందించారు. తాము 5 బౌలర్ల వ్యూహానికి కట్టుబడి ఉన్నామని, క్వారంటైన్‌ తర్వాత రోహిత్‌ శర్మ మానసిక స్థితి, మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ ఎలా ఉన్నాయో చూసిన మూడో టెస్టు ఎంపిక ఉంటుందని రవిశాస్త్రి వెల్లడించాడు. అయితే మూడో టెస్టుకు తగినంత సమయం ఉండటంతో పాటు, మయాంక్‌ అగర్వాల్‌ వరుస వైఫల్యాలతో అతని స్థానంలో రోహిత్‌ మ్యాచ్‌ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ రెండవ టెస్టులో విజయం సాధించి మంచి ఉత్సాహంతో ఉంది. ఆస్ట్రేలియా భారత్ చెరో విజయం సాధించాయి.

Tags:    

Similar News