India-Srilanka: ఇండియా శ్రీలంక మధ్య జరుగుతున్న మొదటి వన్ డే మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి దిగిన లంక జట్టు 50 ఓవర్లు ముగిసే సమయానికి 262/9 పరుగులు చేసింది. ఆరంభంలో దాటిగా ఆడిన లంక జట్టులో కెప్టెన్ డాసక్ షనాక 39 , అస్లాంక 38 , ఫెర్నాండో 32 మినహా ఎవరు పెద్దగా రాణించకపోవడంతో పాటు చివర్లో కరుణరత్నే 43 నాట్ ఔట్ రాణించడంతో 262/9 పరుగులతో సరిపెట్టుకుంది. ఇక భారత బౌలింగ్ లో కులదీప్ యాదవ్, చాహల్, దీపక్ చహార్ లు అద్భుతమైన బౌలింగ్ తో లంక జట్టుని తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు. ఇక పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న భారత్ శ్రీలంక బౌలర్స్ ని ఎదుర్కొని ఎలా రాణిస్తుందో చూడాలి. ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్ళు మంచి ఫామ్ లో ఉండటంతో భారత జట్టు విజయంపై ధీమాగా ఉంది.
శ్రీలంక బ్యాటింగ్:- 262/9 (50 ఓవర్లు)
కరుణరత్నే: 43 నాట్ ఔట్
డాసక్ షనాక : 39
అస్లాంక : 38
ఇండియా బౌలింగ్ :-
దీపక్ చహర్ : 2/ 37 (7)
కులదీప్ యాదవ్ : 2/48 (9)
చాహల్ : 2/52 (10)