మహిళల టీ20ఐ ప్రపంచ కప్ నుంచి భారత్ ఔట్.. పాక్ ఓటమితో గ్రూప్ దశ దాటకుండానే..

ICC Womens T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 నుంచి భారత క్రికెట్ జట్టు నిష్క్రమించింది. గ్రూప్‌-ఎలోని చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 54 పరుగుల తేడాతో ఓటమితో ముందుకు సాగాలనే కలను ముగించుకుంది.

Update: 2024-10-15 03:28 GMT

ICC Womens T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 నుంచి భారత క్రికెట్ జట్టు నిష్క్రమించింది. గ్రూప్‌-ఎలోని చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 54 పరుగుల తేడాతో ఓటపాలైంది. దీంతో లీగ్ నుంచి ముందుకు సాగాలనే కలను ముగించుకుంది. చివరి నాలుగుకు వెళ్లాలంటే భారత జట్టుకు పాకిస్థాన్ జట్టు విజయం సాధించాలని కోరుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 110 పరుగులు చేసింది. అనంతరం పాక్‌ జట్టు 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. 2016 తర్వాత తొలిసారిగా భారత్‌ గ్రూప్‌ దశ దాటలేకపోయింది.

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు కేవలం రెండు మాత్రమే గెలిచి మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. గ్రూప్‌-ఎ నుంచి ఈ రెండు జట్లు సెమీఫైనల్‌లోకి ప్రవేశించాయి. గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరేందుకు పోటీపడుతున్నాయి.

టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శన ఎలా ఉందంటే?

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత, పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించి సెమీ ఫైనల్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కానీ, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో గెలిచినట్లయితే టీమిండియా మార్గం సులభం అయ్యేది. అయితే 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో భారత జట్టు 141 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయ అర్ధ సెంచరీ చేసింది. 47 బంతుల్లో 54 పరుగులు చేసి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నా.. విజయాన్ని అందించలేకపోయింది.

పాక్ బ్యాటర్లు విఫలం..

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు తేలిపోయింది. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో, ఇద్దరు బ్యాటర్స్ మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. కెప్టెన్ ఫాతిమా సనా 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అలాగే, మునిబా అలీ కేవలం 15 పరుగులు మాత్రమే చేసింది. నలుగురి బ్యాటర్లు ఖాతాలు తెరవలేదు. న్యూజిలాండ్‌ తరపున అమీలియా కర్ 14 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. అంతకుముందు, సుజీ బేట్స్ (28), బ్రూక్ హాలిడే (22), కెప్టెన్ సోఫీ డివైన్ (19) కీలక ఇన్నింగ్స్‌ల ఆధారంగా న్యూజిలాండ్ ఆరు వికెట్లకు 110 పరుగులు చేసింది.

Tags:    

Similar News