IND vs NZ: 4 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. పూణెలో సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా ఆల్ రౌండర్
IND vs NZ 2nd Test Match: పూణె మైదానంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో భారత బౌలర్లు సత్తా చాటారు. టీమ్ ఇండియా కివీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 259 పరుగులకే కట్టడి చేసింది. ఈ క్రమంలో స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కీలక పాత్ర పోషించాడు. ఒకరిద్దరు కాదు ఏకంగా 7గురు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లను సుందర్ తన స్పిన్ వలలో చిత్తు చేశాడు. 45 నెలల తర్వాత సుందర్ టెస్టు జట్టులోకి వచ్చాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను ప్లేయింగ్ 11 లోకి రాగానే వికెట్లతో బీభత్సం సృష్టించాడు.
ఈ బ్యాట్స్‌మన్ తన బౌలింగ్‌లో 5గురు బ్యాట్స్‌మెన్‌లను క్లీన్ బౌల్డ్ చేయగా, ఒకరిని ఎల్బీడబ్ల్యూ, మరొకరిని క్యాచ్ అవుట్ చేశాడు. దీంతో పూణె గడ్డపై 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా సుందర్ నిలిచాడు.
రచిన్ రవీంద్రను మొదట వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత అతను డారిల్ మిచెల్ ఎల్బీడబ్ల్యూగా ట్రాప్ చేశాడు. టామ్ బ్లండెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ అశ్విన్ చేతికి చిక్కాడు. టిమ్ సౌథీ, అజాజ్ పటేల్‌లను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా అతను తన పేరిట 7 వికెట్లు పడగొట్టాడు.
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సంఖ్యలో బ్యాటర్లను ఔట్ చేసిన ప్లేయర్లు (భారతదేశం)
5 జసుభాయ్ పటేల్ vs ఆస్ట్రేలియా కాన్పూర్ 1959
5 బాపు నద్కర్ణి vs ఆస్ట్రేలియా బ్రబౌర్న్ 1960
5 అనిల్ కుంబ్లే vs దక్షిణాఫ్రికా జోబర్గ్ 1992
5 రవీంద్ర జడేజా vs ఆస్ట్రేలియా ఢిల్లీ 2023
5 వాషింగ్టన్ సుందర్ vs న్యూజిలాండ్ పూణే 2024
టెస్టుల్లో భారత్ vs న్యూజిలాండ్‌కు అత్యుత్తమ గణాంకాలు..
8/72 ఎస్ వెంకటరాఘవన్ ఢిల్లీ 1965
8/76 ఎరపల్లి ప్రసన్న ఆక్లాండ్ 1975
7/59 ఆర్ అశ్విన్ ఇండోర్ 2017
7/59 వాషింగ్టన్ సుందర్ పూణే 2024.