IND vs NZ: 46 పరుగులకే కుప్పకూలిన భారత్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డ్‌ ఇదే..!

India vs New Zealand Bengaluru Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న బెంగళూరు టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది.

Update: 2024-10-17 08:20 GMT

IND vs NZ: 46 పరుగులకే కుప్పకూలిన భారత్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డ్‌ ఇదే..!

India vs New Zealand Bengaluru Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న బెంగళూరు టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. టెస్టు క్రికెట్‌లో భారత్‌కు ఇది మూడో అత్యల్ప స్కోరు. ఓవరాల్‌గా భారత్‌కు చెందిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ ఖాతా తెరవలేకపోయారు. దీంతో భారత జట్టు బ్యాటింగ్ ఎంత దారుణంగా విఫలమైందో అర్థం చేసుకోవచ్చు.

వర్షం ఉన్నప్పటికీ, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ అతని నిర్ణయం పూర్తిగా తప్పు అని నిరూపితమైంది. మేఘావృతమైన పరిస్థితులను న్యూజిలాండ్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 16 బంతుల్లో 2 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకోవడంతో 9 పరుగుల స్కోరు వద్ద భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ ఖాతాలు కూడా తెరవలేకపోయారు.

మొత్తం 5గురు ఖాతాలు తెరవలే..

కేవలం 10 పరుగులకే 3 వికెట్లు పడిపోయిన తర్వాత, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు స్కోరును 31 పరుగులకు తీసుకెళ్లారు. అయితే ఈ స్కోరులో యశస్వి జైస్వాల్ 13 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి బ్యాట్స్‌మెన్‌లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టడంతో భారత జట్టు చాలా కష్టాల్లో పడింది.

ఓవరాల్‌గా ఈ ఇన్నింగ్స్‌లో భారత్‌కు చెందిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ ఖాతాలు తెరవలేకపోయారు. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఖాతా తెరవలేకపోయారు. కాగా, న్యూజిలాండ్ తరపున మ్యాట్ హెన్రీ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. విలియం ఒరూర్కే 4 వికెట్లు తీశాడు. మాట్ హెన్రీకి ఒక వికెట్ దక్కింది.

భారత జట్టు కూడా తన పేరిట సిగ్గుపడే రికార్డును సృష్టించింది. స్వదేశంలో భారత్‌కు ఇదే అత్యల్ప టెస్టు స్కోరు. ఇది కాకుండా ఓవరాల్ టీమ్ ఇండియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. ఆస్ట్రేలియాపై 36 పరుగులకే ఆలౌట్ అయిన రికార్డు భారత్ ఖాతాలో ఉంది. భారత్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యల్ప స్కోరు.

Tags:    

Similar News