IND vs BAN: 12 ఏళ్ల టెస్టు కెరీర్‌లో తొలిసారిగా.. 'ట్రిపుల్ సెంచరీ'కి చేరువైన టీమిండియా ఆల్ రౌండర్..

Ravindra Jadeja: బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా ఈరోజు జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేసే అవకాశం భారత జట్టుకు కీలకం.

Update: 2024-09-19 05:57 GMT

IND vs BAN: 12 ఏళ్ల టెస్టు కెరీర్‌లో తొలిసారిగా.. 'ట్రిపుల్ సెంచరీ'కి చేరువైన టీమిండియా ఆల్ రౌండర్..

Ravindra Jadeja: బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా ఈరోజు జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేసే అవకాశం భారత జట్టుకు కీలకం. కానీ, టాస్ గెలిచిన బంగ్లా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్.. వార్త రాసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ 21, జైస్వాల్ 28 పరుగులతో నిలిచారు. రోహిత్ 6, గిల్ 0, కోహ్లీ 6 పరుగులకే పెవిలియన్ చేరారు. బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ ఈ మూడు వికెట్లు పడగొట్టడం గమనార్హం. టీమిండియా బలమైన స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన 12 ఏళ్ల సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో తొలిసారిగా 'ట్రిపుల్ సెంచరీ' సాధించే అవకాశం ఉంది. 2012లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రవీంద్ర జడేజా నేడు చెన్నై గడ్డపై చరిత్ర సృష్టించగలడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుతమైన రికార్డు సృష్టించగలడు.

జడేజా తన టెస్టు కెరీర్‌లో తొలిసారి 'ట్రిపుల్ సెంచరీ' సాధించే ఛాన్స్..

35 ఏళ్ల ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో అద్వితీయమైన ట్రిపుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఈ రోజు నుంచి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. ఆ తర్వాత కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.

చరిత్రలో పేరు నమోదయ్యే ఛాన్స్..

రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో భారీ విజయాలు సాధించేందుకు చాలా దగ్గరగా ఉన్నాడు. రవీంద్ర జడేజా భారత్‌ తరపున ఇప్పటివరకు 72 టెస్టు మ్యాచ్‌లు ఆడి 294 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 6 వికెట్లు పడగొట్టగలిగితే, అతను చరిత్ర సృష్టిస్తాడు. రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు పూర్తి చేయనున్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రవీంద్ర జడేజా ఎన్నో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లకు ఇబ్బందులే..

చెన్నైలో రవీంద్ర జడేజా ఈ ప్రత్యేక మెగా రికార్డును సృష్టించే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ కారణంగా చెన్నైలో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లకు ముప్పుగా మారవచ్చు. రవీంద్ర జడేజా టీమ్ ఇండియా బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్. రవీంద్ర జడేజా 72 టెస్టు మ్యాచ్‌ల్లో 294 వికెట్లు పడగొట్టి 3036 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా టెస్టుల్లో 13 సార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా, రవీంద్ర జడేజా టెస్ట్ మ్యాచ్‌లలో రెండుసార్లు 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు.

అగ్రస్థానంలో లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ..

వెటరన్ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే భారత్ తరపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీశాడు. ఇది కాకుండా రవీంద్ర జడేజా 197 వన్డే మ్యాచ్‌లలో 220 వికెట్లు, 74 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 54 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా వన్డేల్లో 2756 పరుగులు, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 515 పరుగులు చేశాడు. 240 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రవీంద్ర జడేజా 160 వికెట్లు పడగొట్టి 2959 పరుగులు చేశాడు.

టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..

1. అనిల్ కుంబ్లే - 619 టెస్టు వికెట్లు

2. రవిచంద్రన్ అశ్విన్ - 516 టెస్ట్ వికెట్లు

3. కపిల్ దేవ్ - 434 టెస్ట్ వికెట్లు

4. హర్భజన్ సింగ్ - 417 టెస్ట్ వికెట్లు

5. ఇషాంత్ శర్మ/జహీర్ ఖాన్ – 311 టెస్ట్ వికెట్లు

6. రవీంద్ర జడేజా - 294 టెస్టు వికెట్లు.

Tags:    

Similar News