Ind vs Aus perth one-day: మొదటి వన్డేలో ఆసీస్ బాటింగ్ మెరుపులు..భారత్ విజయలక్ష్యం..375
Ind vs Aus perth one-day: పెర్త్ లో భారత్ తొ జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మెరుపులు మెరిపించారు.
పెర్త్ లో భారత్ తొ జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మెరుపులు మెరిపించారు. ఆరోన్ ఫించ్.. వార్నర్ ఇచ్చిన శతాధిక శుభారంభాన్ని కొనసాగిస్తూ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ కూడా చక్కగా ఆడటంతో నిర్ణీత 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరోన్ ఫించ్(114; 124 బంతుల్లో 9x4, 3x6), డేవిడ్ వార్నర్(69; 76 బంతుల్లో) శుభారం చేయగా తర్వాత స్టీవ్‌స్మిత్(101; 66 బంతుల్లో), గ్లెన్ మాక్స్‌వెల్(45; 19 బంతుల్లో) మెరుపు బ్యాటింగ్ చేశారు. దీంతో భారత్ ముందు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. టీమ్‌ఇండియా బౌలర్లలో షమి 3 వికెట్లు తీయగా.. బుమ్రా, సైని, చాహల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ [ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఫించ్..వార్నర్ శుభారంభం ఇచ్చారు. ఫించ్ దూకుడుగా ఆడితే, వార్నర్ ఆచితూచి ఆడాడు. దీంతో 25 ఓవర్లు గడిచేసరికి ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా 134 పరుగులు చేసింది. తరువాత షమి వేసిన 27.5 ఓవర్‌కి డేవిడ్ వార్నర్(69) ఔటయ్యాడు. బంతి బ్యాట్‌కు తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్లగా అంపైర్ ఔటివ్వలేదు. అయితే, రివ్యూలో అతడు ఔట్‌గా తేలడంతో భారత్‌కు తొలి వికెట్ దక్కింది. ఆస్ట్రేలియా 156 పరుగుల వద్ద వార్నర్ వెనుతిరిగాడు. ఆ ఓవర్ పూర్తయ్యేసరికి ఆసీస్ 156/1తో నిలిచింది. తరువాత క్రీజులోకి వచ్చిన స్మిత్ కూడా ఫించ్ తొ కలసి వేగంగా ఆడాడు. ఈ క్రమంలో ఫించ్ చాహల్ వేసిన 39వ ఓవర్‌లో కెరీర్‌లో 17వ శతకం సాధించాడు. ఆ తరువాత బుమ్రా వేసిన 40వ ఓవర్‌లో ఫించ్(114) ఔటయ్యాడు. బుమ్రా చివరి బంతిని షార్ట్‌పిచ్‌గా వేయడంతో అతడు వికెట్ల వెనుక గాల్లోకి ఆడాడు. దాంతో రాహుల్ క్యాచ్ అందుకొని టీమ్‌ఇండియాకు రెండో వికెట్ అందించాడు. ఫించ్ తరువాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ స్మిత్ కు తోడయ్యాడు. ఇద్దరూ వేగంగా పరుగులు సాధించారు. షమి వేసిన 45వ ఓవర్‌లో మాక్స్‌వెల్(45) ఔటయ్యాడు. అనంతరం మార్నస్ లబుషేన్ క్రీజులోకి వచ్చాడు. అయితే తరువాతి ఓవర్లోనే ఆటను అవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 331 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన 49వ ఓవర్‌లో స్మిత్(100) తొలి రెండు బంతుల్లో 5 పరుగులు సాదించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.