Team India: సూపర్ 8లో భారత్‌కు రెడ్ అలర్ట్.. ట్రోఫీ పోరులో కన్నీరు మిగిల్చిన జట్టుతో పోటీ..!
T20 World Cup Super 8 Scenario: T20 ప్రపంచ కప్ 2024లో లీగ్ రౌండ్ చివరి దశకు చేరుకుంది. సూపర్-8 ప్రారంభానికి ఇంకా వారం కంటే తక్కువ సమయం ఉంది.
T20 World Cup Super 8 Scenario: T20 ప్రపంచ కప్ 2024లో లీగ్ రౌండ్ చివరి దశకు చేరుకుంది. సూపర్-8 ప్రారంభానికి ఇంకా వారం కంటే తక్కువ సమయం ఉంది. ఒకవైపు టీమ్ ఇండియా ఇప్పటికే సూపర్-8 టికెట్ బుక్ చేసుకోగా, మరోవైపు సూపర్-8లో రోహిత్ సేన కోసం ఓ శత్రు జట్టు కూడా ఎదురుచూస్తోంది. గత రెండేళ్ళలో టీమిండియాకు అనేకసార్లు గాయాలను మిగిల్చిన ఆస్ట్రేలియా గురించే మనం మాట్లాడుతున్నాం.
భారత్ vs ఆస్ట్రేలియా పోరు..
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌ను ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తర్వాత రెండవ అతిపెద్ద పోరుగా పిలుస్తుంటారు. ఒక్కసారి కాదు చాలా సార్లు భారత్, ట్రోఫీ ముందు ఆస్ట్రేలియన్ జట్టుతో పోటీ పడింది. దీనికి అతిపెద్ద ఉదాహరణ 2023 సంవత్సరం. పాట్ కమిన్స్ కెప్టెన్సీలోని ఆసీస్ జట్టు టీమిండియా నుంచి రెండు ICC ట్రోఫీలను లాగేసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియాను ఓడించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ నుంచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
సెమీస్ ఎప్పుడు?
గ్రూప్-ఎలో అగ్ర స్థానంలో నిలిచి సూపర్-8కి భారత జట్టు అర్హత సాధించింది. జూన్ 20న గ్రూప్-సిలో మొదటి స్థానంలో నిలిచిన జట్టుతో సూపర్-8లో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. అదే సమయంలో జూన్ 22న టీమ్ ఇండియా రెండో మ్యాచ్ ఆడనుంది. ఇందులో గ్రూప్ డిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో జట్టు పోటీపడనుంది. ఈ జట్లను ఇంకా నిర్ణయించలేదు. ఇది కాకుండా, జూన్ 24న సెయింట్ లూసియాలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య పోరు మొదలుకానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో పాత స్కోర్లు తేల్చుకునేందుకు భారత జట్టుకు సువర్ణావకాశం లభించనుంది.
'రెడ్ అలర్ట్' ప్రకటించిన ట్రావిస్ హెడ్..
ఈ కీలకపోరులో భారత జట్టు తన నిజమైన శత్రువు ట్రావిస్ హెడ్‌పై మాస్టర్ ప్లాన్ వేయాల్సి ఉంటుంది. ఇతను ఆస్ట్రేలియాకు చెందిన డేంజరస్ ఆటగాడు. ఈ ఆటగాడు భారత్ నుంచి రెండు ఐసీసీ ట్రోఫీలను లాగేసుకున్నాడు. అది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అయినా లేదా ODI ప్రపంచకప్ ఫైనల్ అయినాసరే. రెండింటిలోనూ ట్రావిస్ సెంచరీ చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో కూడా ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను 3 మ్యాచ్‌ల్లో 12, 34, 34* పరుగులతో ఫాంలోకి వస్తున్నాడు.