IND vs AUS 2nd ODI : అదరగొట్టిన ఆసీస్.. భారత్ ముందు భారీ టార్గెట్ !

ఈ మ్యాచ్ లో ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టుకి ఓపెనర్లు వార్నర్‌, ఫించ్‌ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ అర్ధశతకలతో కదం తొక్కారు.

Update: 2020-11-29 07:43 GMT

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డేలో ఆసీస్ ఆటగాళ్ళు మరోసారి అదరగొట్టారు. నిర్ణిత 50 ఓవర్లలలో నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టుకి ఓపెనర్లు వార్నర్‌, ఫించ్‌ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ అర్ధశతకలతో కదం తొక్కారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 142 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది ఆసీస్ జట్టు. బుమ్రా వేసిన 23వ ఓవర్‌ లోని ఐదో బంతికి ఆరోన్‌ ఫించ్‌(60) ఔటయ్యాడు. ఆ తరవాత వెంటనే మరో ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌(83) రనౌటయ్యాడు. స్మిత్‌ ఆడిన షాట్‌కు సింగిల్‌ తీయగా వార్నర్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే, శ్రేయస్‌ అయ్యర్‌ డైరెక్ట్‌ త్రో విసరడంతో వార్నర్ పెవిలియన్‌ చేరాడు.

దీంతో ఆస్ట్రేలియా 156 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది ఆసీస్ జట్టు. ఇక స్టీవ్‌స్మిత్‌, లబుషేన్‌ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జట్టును ముందుండి నడిపించారు. చూడచక్కని షాట్లుతో అలరించారు. ఈ క్రమంలోనే స్మిత్‌ శతకం, లబుషేన్‌ అర్ధశతకలను పూర్తి చేశారు. ఇక హార్దిక్‌ పాండ్య వేసిన 42వ ఓవర్‌లో తొలి బంతికి ఫోర్‌ కొట్టిన స్మిత్‌(104) రెండో బంతికి కూడా బౌండరీ కొట్టబోయి ఔటయ్యాడు. అప్పటికి ఆసీస్ జట్టు స్కోర్ 296 ఉంది. ఇక చివర్లో మాక్స్ వెల్ కూడా బ్యాట్ ఝాళీపించడంతో ఆసీస్ జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 389 పరుగుల భారీ స్కోర్ ను చేయగలిగింది. ఈ మ్యాచ్ లో కూడా భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారనే చెప్పాలి. అటు మొదటి వన్డేలో గెలిచిన ఆసీస్ జట్టు సిరీస్ లో ముందజలో ఉంది. 

Tags:    

Similar News