IND vs PAK: ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్
IND vs PAK: పాకిస్తాన్‌తో తొలి సమరానికి సై అంటున్న భారత్
IND vs PAK: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఢీకొట్టనుంది. టి20 ప్రపంచకప్‌ను సాధించాలనే లక్ష్యంతో భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం ఆరున్నరకు కేప్‌టౌన్‌లో జరగనుంది. కీలకమైన పోరుకు ముందు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్‌నెస్ సమస్యలు జట్టును సతమతం చేస్తున్నాయి. తొలి మ్యాచ్‌కు స్మృతి గాయంతో జట్టుకు దూరమవడం బ్యాటింగ్‌పై ప్రభావం చూపగలదు. అయితే ఇటీవల షఫాలీ వర్మ, రిచా అండర్–19 ఈవెంట్‌లో రాణించారు. ఇప్పుడు కూడా బాధ్యతను పంచుకుంటే ఆ సమస్యను అధిగమించవచ్చు. జెమీమా, హర్లీన్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మిడిలార్డర్‌లో రాణిస్తే జట్టుకు ఢోకా ఉండదు. బౌలింగ్‌లో రేణుక, శిఖా పాండే, దీప్తి శర్మ రాణిస్తే పాకిస్తాన్‌పై భారత్‌కు విజయం సులువవుతుంది.