New IPL Team: కొత్త ఐపీఎల్ టీమ్ రెడీ చేస్తున్న రాంచరణ్.. వచ్చే ఏడాదిలోనే ఎంట్రీ..?

Ram Charan: క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు రాంచరణ్.

Update: 2023-04-18 07:02 GMT

New IPL Team: కొత్త ఐపీఎల్ టీమ్ రెడీ చేస్తున్న రాంచరణ్.. వచ్చే ఏడాదిలోనే ఎంట్రీ..?

Ram Charan: క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు రాంచరణ్. ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్..కేవలం నటనకు మాత్రమే పరిమితం కావడం లేదు. విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెడుతూ ట్రూ బిజినెస్ మెన్ అనిపించుకుంటున్నాడు. చరణ్ గతంలో ఒక పోలో టీమ్ ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ట్రూ జెట్ పేరుతో విమానయాన సంస్థను షురూ చేశాడు. ఓ వైపు నటిస్తూనే మెగా పవర్ స్టార్ నిర్మాతగా మారి సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. ఇలా విభిన్నరంగాల్లో రాణిస్తున్న చరణ్ తాజాగా క్రీడారంగంలో మరో అడుగుముందుకేశాడు.

వ్యాపార రంగంలో గొప్పగా రాణిస్తున్న చరణ్ తాజాగా ఐపీఎల్ పై ఫోకస్ చేశాడు. ఇందులో భాగంగానే ఆయన వచ్చే ఏడాది ఓ కొత్త ఐపీఎల్ టీమ్ ను మనకు పరిచయం చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని..వచ్చే ఏడాది ఐపీఎల్ లో రాంచరణ్ ఫ్రాంచైజీ నుంచి వైజాగ్ వారియర్స్ టీమ్ అడుగుపెట్టనుంది. గత ఏడాది ఐపీఎల్ లో గుజరాత్, లక్నో ఫ్రాంచైజీలు అడుగుపెట్టాయి. తెలంగాణ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక్క టీమ్ కూడా లేదు..అందుకే రామ్ చరణ్ వైజాగ్ వారియర్స్ పేరిట ఒక కొత్త ఐపీఎల్ టీమ్ తో వచ్చే ఏడాది నుంచి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

క్రికెటర్లతో పాటు క్రికెట్ నే నమ్ముకున్న వారి పాలిట ఐపీఎల్ కల్పవృక్షంగా మారింది. వందలకోట్ల పెట్టుబడితో నీతా అంబానీ, శ్రీనివాసన్, విజయ్ మాల్యా, షారుఖ్ ఖాన్, ప్రీతిజింటా, శిల్పాశెట్టి వంటివారు ఫ్రాంచైజీ యజమానులుగా రాణిస్తున్నారు. ఫ్రాంచైజీలు సగటున సీజన్ కు వందకోట్ల రూపాయలకు పైగా స్పాన్సర్ షిప్ ల ద్వారా సంపాదిస్తున్నాయి. అందుకే రాంచరణ్ సైతం ఈ దిశగా ఫోకస్ చేశాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాంచరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News