WPL 2023: WPLలో ముంబైకి హ్యాట్రిక్ విజయం
WPL 2023: 8వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపు
WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ 2023లో ముంబయి ఇండియన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే గుజరాత్, బెంగళూరు జట్లపై గెలుపొందిన హర్మన్ సేన.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై జయ కేతనం ఎగురవేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీపై జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబయి ఓపెనర్లు యాస్తికా భాటియా 41 పరుగులు, హీలీ మాత్యూస్ 32 పరుగులతో రాణించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. 18 ఓవర్లలో 105 పరుగులు చేసి ఆలౌట్ అయింది.