ప్రతీ రేపిస్ట్‌ను ఇదే విధంగా శిక్షిస్తారా?

Update: 2019-12-06 08:11 GMT
Gutta Jwala

దిశను దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో విచారణ జరుపుతున్నప్పుడు పోలీసులుపై దాడి చేసి వారి నుంచి గన్ లాక్కొని పారిపోతుండగా, పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి పెద్దఎత్తున చేరుకున్న ప్రజలు, పోలీసులకు జయజయధ్వానాలు పలుకుతూ, పూలవర్షం కురిపించారు. ఇక విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసులకు హ్యాట్సాఫ్‌ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు దినిపై స్పందిస్తున్నారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిని సైనా నెహ్వాల్‌ పోలీసులను ప్రశంసించారు. పోలీసులకు అభినందనలు తెలిపారు. మరో కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ తెలంగాణ పోలీసులు తన పవర్ చూపించారన్నారు. నిందితులను హతమర్చి బాధిత కుటుంబ సభ్యులకు సత్వర న్యాయం చేశారని వ్యాఖ్యానించారు.

ఇక మరో బ్యాడ్మింటన్‌ స్టార్ గుత్తా జ్వాలా తన ట్వీటర్‌ ‌ఖాతాలో స్పందిస్తూ.. పోలీసుల్ని సూటిగా ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రతీ నిందితులను ఇదే తరహా శిక్ష విధించాలన్నారు. మహిళలపై అత్యాచారాలు దాడులకు పాల్పడతారో వారికి ఇదే విధంగా బుద్ధి చెప్పాలన్నారు. దీని వలన అత్యాచార ఘటనలకు ముగింపు దొరుకుతుందా అని ప్రశ్నించారు. అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న అంటూ ఆమె పోస్టు చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారిని ఇలానే శిక్షిస్తారా అంటూ గుత్తా జ్వాల ప్రశ్నించారు.


Tags:    

Similar News