DC vs GG: ఢిల్లీకి షాకిచ్చిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో 11 పరుగుల తేడాతో విజయం
DC vs GG: ఢిల్లీకి షాకిచ్చిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో 11 పరుగుల తేడాతో విజయం
DC vs GG: మహిళల ప్రిమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు 11 పరుగుల తేడాతో గెలుపొందింది. గుజరాత్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఛేదించలేకపోయింది. 18.4 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గర్త్, తనూజ కన్వర్, గార్డెనర్ తలో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లూరా వోల్వార్డ్ 45 బంతుల్లో 57పరుగులు, గార్డెనర్ 33 బంతుల్లో 51 పరుగులు చేశారు.