టీ20 సిరీస్‌లో ఈ ముగ్గురు మొనగాళ్లకు చోటు దక్కాల్సిందే.. లేదంటే టీమిండియా ఫ్యూచర్‌కే నష్టం..
Sri Lanka vs India: భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
Sri Lanka vs India: భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ భారత జట్టులో ప్రతిభ గల యువకులకు చోటు దక్కింది. కొంతమంది కొత్త ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. చాలా మంది ఆటగాళ్లకు ఎంతో అనుభవం కూడా ఉంది.
శ్రీలంకతో సిరీస్ యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. 2026 టీ20 ప్రపంచకప్‌నకు జట్టును సిద్ధం చేయాలంటే, ఇక నుంచి యువ ఆటగాళ్లకు వీలైనంత ఎక్కువ అవకాశం ఇవ్వాలి. శ్రీలంక సిరీస్‌కు కూడా పలువురు యువ ఆటగాళ్లు ఎంపికయ్యారు. ప్రతి మ్యాచ్‌లో ఆడాల్సిన ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం.
3. రవి బిష్ణోయ్..
రవి బిష్ణోయ్ ఇటీవల జింబాబ్వే టూర్‌లో ఆడుతూ కనిపించాడు. శ్రీలంక సిరీస్‌కు భారత జట్టులోకి కూడా ఎంపికయ్యాడు. రవి బిష్ణోయ్ అద్భుతమైన స్పిన్ బౌలర్. భవిష్యత్తులో భారతదేశానికి పెద్ద సూపర్ స్టార్ కాగలడు. బిష్ణోయ్‌లోని ప్రత్యేకత ఏమిటంటే, అతను వికెట్లు తీయగలడు, పరుగులను సాధించగలడు. తనరోజున మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించగలడు. ఇది కాకుండా, అతను గొప్ప ఫీల్డర్ కూడా. ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌లలో చాలా అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ, ఆకట్టుకున్నాడు. అందుకే ప్రతి మ్యాచ్‌లోనూ అతనికి అవకాశం రావాలి.
2. రింకూ సింగ్..
ప్రతి మ్యాచ్‌లో తుఫాన్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్‌కు కూడా అవకాశం రావాలి. రింకూ సింగ్‌కు చాలా సత్తా ఉంది. కానీ, ఇప్పటి వరకు భారత్ అతడిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. రింకూ సింగ్‌కి ప్రతి మ్యాచ్‌లో అవకాశం లభిస్తే, అతని ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. భవిష్యత్తులో, అతను ఫినిషర్‌గా చాలా బలంగా నిరూపించుకోగలడు.
1. యశస్వి జైస్వాల్..
టీ20 నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, యశస్వి జైస్వాల్ ఈ ఫార్మాట్‌లో అతనిని భర్తీ చేయగలడు. కేవలం కొన్ని బంతుల్లోనే మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా అతడికి ఉంది. ఇక నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ ఆడితే ప్రపంచకప్ వరకు పరిణతి చెందిన ఆటగాడిగా మారగలడు. ఎడమచేతి వాటం అయినందున, అతను లెఫ్ట్ ఆర్మ్ పేసర్లపై కొంచెం ప్రయోజనం పొందుతాడు.