Asia Cup 2023: వార్నీ ఇది మ్యాచా.. రికార్డుల వర్షమా.. చారిత్రాత్మక రోజు నుంచి అతిపెద్ద విజయం వరకు.. పూర్తి వివరాలు మీకోసం..!
Asia Cup 2023: వార్నీ ఇది మ్యాచా.. రికార్డుల వర్షమా.. చారిత్రాత్మక రోజు నుంచి అతిపెద్ద విజయం వరకు.. పూర్తి వివరాలు మీకోసం..!
Asia Cup 2023: ప్రపంచ నంబర్ 1 పాకిస్థాన్ తమ ఆసియా కప్ ప్రచారాన్ని బుధవారం, ఆగస్టు 30న అట్టహాసంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు నేపాల్‌పై 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో పాకిస్థాన్‌కు ఇదే అతిపెద్ద విజయం.
ముల్తాన్ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 342 పరుగులు చేసింది. అనంతరం నేపాల్ జట్టు 23.4 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. 151 పరుగులతో ఇన్నింగ్స్ ఆడిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. కెప్టెన్ బాబర్ ఆజం, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్‌లు పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
అయితే, ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. నేపాల్‌కు చారిత్రాత్మక రోజు..
ఆసియా కప్‌లో తొలి మ్యాచ్ ఆడిన బుధవారం నేపాల్ క్రికెట్‌కు చారిత్రాత్మక రోజు. వారి పురుషుల క్రికెట్ జట్టు ఆసియా కప్‌లో అరంగేట్రం చేసి మొదటి మ్యాచ్ ఆడింది. నేపాల్ వన్డే ఆసియా కప్ ఆడిన 8వ జట్టుగా అవతరించింది. అంతకు ముందు, 21వ శతాబ్దంలో హాంకాంగ్, UAE 2004లో, ఆఫ్ఘనిస్తాన్ 2014లో అరంగేట్రం చేశాయి. భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్ 1984, బంగ్లాదేశ్ జట్టు 1986 నుంచి ఆసియా కప్ ఆడుతున్నాయి.
2. నేపాల్ ఫాస్ట్ బౌలర్ సోంపాల్ కమీ పేరటి అవాంచిత రికార్డ్..
10 ఓవర్లలో 85 పరుగులు ఇచ్చాడు. దీంతో వన్డే ఇన్నింగ్స్‌లో నేపాల్ నుంచి అత్యధిక పరుగులు కొల్లగొట్టిన ఆటగాడిగా అవాంఛిత రికార్డు సృష్టించాడు. అంతకుముందు సోంపాల్ 2022లో పాపువా న్యూ గినియాపై 9 ఓవర్లలో 81 పరుగులు ఇచ్చాడు. అదే సమయంలో, నేపాల్‌కు చెందిన కరణ్ కెసి కూడా 2023లో వెస్టిండీస్‌పై 10 ఓవర్లలో 81 పరుగులు ఇచ్చాడు.
3. ఆసియా కప్‌లో నంబర్-6లో సెంచరీ..
పాకిస్థాన్ నుంచి నంబర్-6 స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇఫ్తికర్ అహ్మద్ కేవలం 71 బంతుల్లో 109 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఆసియా కప్‌లో 6వ స్థానంలో సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో, ఇఫ్తికార్ నంబర్-6 వద్ద అతిపెద్ద స్కోరు చేయడంలో మూడో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (124), బంగ్లాదేశ్‌లో అలోక్ కపాలీ (115) మాత్రమే అతని కంటే ఎక్కువ పరుగులు చేయగలిగారు.
4. పాకిస్థాన్‌కు 5వ వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యం..
బాబర్ ఆజం, ఇఫ్తికార్ అహ్మద్‌లు పాక్‌కు 5వ వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ నేపాల్‌పై 131 బంతుల్లో 214 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యంలో బాబర్ 102 పరుగులు, ఇఫ్తికార్ 109 పరుగులు జోడించారు. వీరిద్దరి కంటే ముందు ఉమర్ అక్మల్, యూనిస్ ఖాన్ 2009లో శ్రీలంకపై ఐదో వికెట్‌కు 176 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
5. ఆసియా కప్‌లో మూడో అతిపెద్ద భాగస్వామ్యం..
బాబర్, ఇఫ్తికార్ ఐదో వికెట్‌కు ఆసియా కప్‌లో కూడా అతిపెద్ద భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అదే సమయంలో, ఇద్దరూ ఏ వికెట్‌కైనా మూడో అతిపెద్ద భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మొదటి, రెండో నంబర్లలో పాక్ ఆటగాళ్ల పేర్లు కూడా ఉన్నాయి. 2012లో మహ్మద్ హఫీజ్, నాసిర్ జంషెడ్ భారత్‌పై 224 పరుగులు జోడించారు. 2004లో, షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్ హాంకాంగ్‌పై 223 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
6. ఆసియా కప్‌లో రెండో అతిపెద్ద విజయం..
పాకిస్థాన్ 238 పరుగుల తేడాతో నేపాల్‌ను ఓడించి, ఆసియా కప్‌లో రెండో అతిపెద్ద విజయం. పరుగుల పరంగా చూస్తే ఆసియాకప్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద విజయం. 2008లో హాంకాంగ్‌ను 256 పరుగుల తేడాతో ఓడించిన అతిపెద్ద విజయ రికార్డు భారత్ పేరిట ఉంది.
ఆసియా కప్ చరిత్రలో పాకిస్థాన్‌కు ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు 2000లో బంగ్లాదేశ్‌పై ఆ జట్టు 233 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ వన్డే చరిత్రలో ఇది మూడో అతిపెద్ద విజయం. ఇంతకుముందు ఆ జట్టు 2016లో ఐర్లాండ్‌పై 256 పరుగుల తేడాతో, 2018లో జింబాబ్వేపై 244 పరుగుల తేడాతో విజయం సాధించింది.
7. ఆసియా కప్‌లో పాకిస్థాన్ మూడో అత్యధిక స్కోరు..
నేపాల్‌పై పాకిస్థాన్ 6 వికెట్లకు 342 పరుగులు చేసింది. ఆసియా కప్‌లో జట్టుకు ఇది మూడో అత్యధిక స్కోరు. అంతకుముందు 2004లో హాంకాంగ్‌పై ఆ జట్టు 343 పరుగులు చేసింది. 2010లో బంగ్లాదేశ్‌పై 385 పరుగులు చేయడం ద్వారా జట్టు అత్యధిక స్కోరు సాధించింది.