Danish Kaneria On Ram Temple Bhoomi Poojan : అయోధ్య భూమి పూజపై పాక్‌ మాజీ క్రికెటర్‌!

Danish Kaneria On Ram Temple Bhoomi Poojan : నిన్న అయోధ్యలో జరిగిన అయోధ్య రామమందిర భూమి పూజపైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్‌

Update: 2020-08-06 11:54 GMT
Danish Kaneria(File Photo)

Danish Kaneria On Ram Temple Bhoomi Poojan : నిన్న అయోధ్యలో జరిగిన అయోధ్య రామమందిర భూమి పూజపైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్‌ కనేరియా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. హిందువులకు ఇదొక చారిత్రక ఘట్టం అని, శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని డానిష్‌ కనేరియా ట్వీట్‌ చేశాడు. శ్రీరాముడు మంచితనానికి, సౌభ్రాతృత్వానికి, ఐకమత్యానికి ప్రతీక అని ట్వీట్ చేసాడు. ఎప్పటినుంచో వివాదంలో ఉన్న అయోధ్యలో భూమి పూజ జరగడంతో ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఆనందంగా ఉన్నారని డానిష్‌ కనేరియా వెల్లడించాడు. హిందువులకు ఇదొక చారిత్రక ఘట్టమని, శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని, కలిసి ఉండటం, సోదరభావంతో మెలగడం వంటి విషయాలు శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవచ్చని కనేరియా వెల్లడించాడు.

ఇక కనేరియా విషయానికీ వచ్చేసరికి పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌లో ఆడిన రెండవ హిందూ క్రికెటర్‌ కనేరియానే కావడం విశేషం.. అంతకుముందు అనిల్‌ దల్‌పత్‌ అనే హిందూ బౌలర్‌ 1980 సంవత్సరంలో పాక్‌ జట్టు తరుపున ఆడిన మొదటి హిందూ క్రికెటర్ గా పేరు పొందాడు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే అనిల్‌ దల్‌పత్‌ కి డానిష్‌ కనేరియా స్వయంగా బంధవు కావడం... ఇక మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడటంతో కనేరియాపై జీవిత కాల నిషేధాన్ని ఎదురుకుంటున్నాడు. తాను హిందువు అయినందునే పీసీబీలో తనకు మద్దతు లేదని వ్యాఖ్యానించాడు. కాగా, కనేరియా 2012లో ఇంగ్లీష్‌ కౌంటీ క్రికెట్‌లో ఆడుతూ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడడంతో అతనిపైన పీసీబీ నిషేధాన్ని విధించింది.  


Tags:    

Similar News