England vs West Indies 3rd Test Day 2 Highlights: ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకి విండిస్ విలవిల!
మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించిన విండిస్ జట్టు రెండో టెస్ట్ లో పోరాట ప్రతిభను చూపించింది. ఇక నిర్ణయాత్మక మూడో
England vs West Indies 3rd Test Day 2 Highlights: మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించిన విండిస్ జట్టు రెండో టెస్ట్ లో పోరాట ప్రతిభను చూపించింది. ఇక నిర్ణయాత్మక మూడో టెస్టులో మాత్రం తేలిపోతుంది .. మూడో టెస్టులో ఆతిధ్య జట్టును మొదటి ఇన్నింగ్స్ లో 369 పరుగులకి ఆలౌట్ చేసిన విండిస్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో మాత్రం నిలకడగా ఆడకుండా పేలవ ప్రదర్శనను కనబరుస్తుంది.
లంచ్ తర్వాత మొదలైన విండిస్ ఇన్నింగ్స్ లో ఆ జట్టు ఓపెనర్ బ్రాత్‌వైట్ ఒక పరుగుకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హోప్ (17) మరో ఓపెనర్ క్యాంప్‌బెల్ (32)తో జత కలిశాడు. ఈ జోడీ కాసేపు నిలబడడంతో విండీస్ కోలుకున్నట్లే కనిపించింది. అయితే ఇంగ్లాండ్ బౌలర్ ఆర్చర్ రాకతో విండీస్ పతనం మొదలైంది.. ఒక అద్భుతమైన బౌన్సర్‌తో క్యాంప్‌బెల్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత అండర్సన్ బౌలింగ్ లో హోప్ వెనుదిరగడంతో విండిస్ జట్టు టీ విరామానికి 59 పరుగులు మాత్రమే చేసింది.
ఇక టీ విరామం తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన అండర్సన్ బ్రూక్స్ (4)ను వెనక్కి పంపాడు. విండిస్ బాట్స్ మెన్ ఛేజ్ (36 బంతుల్లో 9) కొద్దిసేపు ఇంగ్లీష్ బౌలర్లకి సహనానికి పరీక్ష పెట్టాడు. ఆ తర్వాత బ్రాడ్ వేసిన ఓ అద్భుతమైన బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో విండీస్ 110/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఫాలోఆన్ ప్రమాదంలో పడిన దశలో కెప్టెన్ హోల్డర్, కీపర్ డౌరిచ్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. దీనితో రెండోరోజు ఆట ముగిసే సమయానికి విండిస్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకి 137 పరగులు చేసింది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 258/4 పరుగులతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు మొదటి నాలుగు ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయింది. ఇక చివర్లో వచ్చిన స్టువర్ట్ బ్రాడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 33 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ మిగిలిన రెండు వికెట్లను కోల్పోయింది.