England vs West Indies 2nd Test Day 4 Highlights: ఉత్కంఠ భరితంగా ఇంగ్లాండ్, విండీస్ రెండో టెస్టు!
England vs West Indies 2nd Test Day 4 Highlights: ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది.. మొదటగా ఓటమికి దగ్గరైనట్టు కనిపించిన విండీస్ జట్టు ఫాలోఆన్ నుంచి తప్పించుకుంది.
England vs West Indies 2nd Test Day 4 Highlights: ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది.. మొదటగా ఓటమికి దగ్గరైనట్టు కనిపించిన విండీస్ జట్టు ఫాలోఆన్ నుంచి తప్పించుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టు పది వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (75; 165 బంతుల్లో 8×4), షమర్ బ్రూక్స్ (68; 137 బంతుల్లో 11×4), రోస్టన్ చేజ్ (51; 85 బంతుల్లో 7×4) పోరాడటంతో విండీస్ జట్టు ఫాలోఆన్ నుంచి బయటపడింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది. అయితే విక్టరీ పైన కన్నేసిన ఇంగ్లీష్ జట్టు స్టోక్స్ (16 బ్యాటింగ్), బట్లర్ (0) ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే ఇంగ్లీష్ బ్యాట్సమెన్స్ ని విండీస్ బౌలర్ రోచ్ దెబ్బ తీశాడు. దీనితో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది. దీనితో ఇంగ్లాండ్ మొత్తం ఆధిక్యం 219కి చేరుకుంది. ఇక ఈ రోజు ( జులై 20)న ఫస్ట్ సెషన్ లో 300 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించుకొని లక్ష్యాన్ని విండీస్‌కు నిర్దేశించి విండీస్ ని మిగతా రెండు సెషన్ లలో ఔట్ చేస్తే ఇంగ్లాండ్ జట్టుకు విజయం దక్కడం పెద్డ విషయం ఏమీ కాదు..
ఇక నాలుగో రోజు ఆటలో ఓవర్ నైట్ స్కోర్ 32/1తో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన విండీస్ జట్టు మొదటి పది ఓవర్లు నిలకడగా ఆడింది. నైట్‌వాచ్‌మన్ అల్జారి జోసెఫ్ (25) చివరికి బెస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్రాత్‌వైట్ కి జత కలిసిన బ్రూక్స్ ఇంగ్లీష్ బౌలర్లను విసిగించారు. దీనితో విండీస్ జట్టు మెల్లిగా 200 స్కోర్ ని దాటింది. ఇక బెన్ స్టోక్స్ బౌలింగ్ లో బ్రాత్‌వైట్ రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో విండీస్ వికెట్ల పతనం మొదలైంది. దీనితో విండీస్ 10 వికెట్లు నష్టానికి 287 పరుగులు చేసింది.