England vs West Indies 1st Test Day 5 Highlights: ఇంగ్లాండ్ పై విండీస్ గ్రాండ్ విక్టరీ!
England vs West Indies 1st Test Day 5 Highlights: ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ జట్టును ఓడించడం అంటే అది మాములు విషయం కాదు.. అందులోనూ విండీస్ జట్టు అయితే ఇంకా కష్టం
England vs West Indies 1st Test Day 5 Highlights: ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ జట్టును ఓడించడం అంటే అది మాములు విషయం కాదు.. అందులోనూ విండీస్ జట్టు అయితే ఇంకా కష్టం.. అలా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన విండీస్ జట్టు సౌథాంప్టన్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ పై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ కి వర్షం దోబూచులాడింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ జట్టు 204 పరుగులకే ఆలౌటైంది. విండీస్ బౌలర్లలో హోల్డర్ 6, గాబ్రియేల్ 4 వికెట్లు పడగొట్టారు. ఇక ఆ తర్వాత వెస్టిండీస్ 318 పరుగులు చేసి 114 పరుగుల ఆధిపత్యాన్ని సంపాదించుకుంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్ 4, అండర్సన్ 3, బెస్ 2, మార్క్ వుడ్ ఒక్కో వికెట్ తీశారు.
ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లీష్ జట్టు చాలా నిదానంగా ఆటను మొదలుపెట్టింది. ఒక క్రమంలో తొమ్మిది ఓవర్ లకి గాను మూడు పరుగులు చేసింది. తొలి వికెట్‌కు ఇంగ్లాండ్ ఓపెనర్లు బర్న్స్ (42), సిబ్లీ (50) కలిసి 72 పరుగుల జోడించారు. ఇక ఆ తర్వాత వచ్చిన డెన్లీ 29, జాక్ 79, స్టోక్స్ 46, ఆర్చర్ 23, పోప్ 12 పరుగులు చేశారు..ఇక ఆ తర్వాత విండీస్ బౌలర్లు రెచ్చిపోవడంతో కేవలం 60 పరుగులకే ఆఖరి ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఇంగ్లాండ్ అలౌట్ అయింది.
ఇక ఆ తర్వాత 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టలో ఛేజ్ 37, బ్లాక్‌వుడ్ 95, డౌరిచ్ 20 రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 3, స్టోక్స్ 2, మార్క్ వుడ్ ఒక్కో వికెట్ తీశారు. దీనితో సిరీస్ లో విండీస్ జట్టు 1-0 తో ముందంజలో ఉంది. మొత్తం మ్యాచ్ లో అద్భుతమైన విషయం ఏంటంటే.. ఇంగ్లాండ్‌ను మిడిలార్డర్ ముంచగా.. విండీస్‌ను గెలిపించడం.