England vs West Indies 1st Test Day 4 highlights: ఆసక్తికరంగా మారిన ఇంగ్లాండ్, విండిస్ తొలి టెస్టు!
England vs West Indies 1st Test Day 4 highlights: ఇంగ్లాండ్, వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న తోలి టెస్ట్ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఓవర్ నైట్ స్కోర్ 15/0 తో నాలుగో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసుకుంటూ వచ్చింది.
England vs West Indies 1st Test Day 4 highlights: ఇంగ్లాండ్, వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న తోలి టెస్ట్ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఓవర్ నైట్ స్కోర్ 15/0 తో నాలుగో రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసుకుంటూ వచ్చింది. ఓపెనర్లు రోరి బర్న్స్ , సిబ్లె బౌండరీలు బాదకపోయిన క్రీజులో పాతుకుపోయారు. ఎంతలా అంటే తొమ్మిది ఓవర్లలో కేవలం మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత వీరి పార్నర్ట్‌షిప్ కి బ్రేక్ పడింది. బర్న్స్ రూపంలో ఇంగ్లాండ్ మొదటి వికెట్ ని కోల్పోయింది. మొదటివికెట్ కి కలిసి వీరిద్దరూ ఫస్ట్ వికెట్‌కు 72 రన్స్ జోడించారు.
ఆ తరవాత బ్రేక్ తరవాత మళ్ళీ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు స్పీడ్ పెంచింది. సిబ్లేబౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు వంద పరుగులు దాటింది. ఇక సిబ్లే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే గాబ్రియెల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రాలీ, డెన్లీకి తోడయ్యాడు. ఇద్దరూ కలిసి విండిస్ బౌలర్ల పైన దాడి చేశారు. దీనితో జట్టు స్కోర్ 15౦ దాటింది. ఈ క్రమంలో చెత్త షాట్ ఆడిన డెన్లీ అవుట్ అయ్యాడు. ఇక టీ విరామం తర్వాత ఇంగ్లాండ్ జట్టు మరో మూడు వికెట్లు కోల్పోయింది.
ఇక ఇంగ్లాండ్ స్టాండింగ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, క్రాలీకి తోడయ్యాడు. ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ చూడచక్కని షాట్లతో ఆటను కొనసాగించారు. ఈ క్రమంలో విండిస్ బౌలర్లు రెచ్చిపోయారు. 16 పరుగుల తేడాతో మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ని పెద్ద దెబ్బ తీశారు. దీనితో ఇంగ్లీష్ జట్టు నాలుగో రోజు ఆటముగిసే సమయానికి సెకండ్‌ఇన్నింగ్స్‌లో 284/8 పరుగులు చేసింది. దీనితో ఇంగ్లాండ్ జట్టుకి 170 పరుగులు మాత్రమే లీడ్ లభించింది. ఇక ఐదో రోజు ఆటలో విండిస్ జట్టు మొదటి సెషన్ లోనే ఇంగ్లాండ్ జట్టుని ఆలౌట్ చేస్తే విజయం దక్కే అవకాశం ఉంది.