England vs West Indies 1st Test Day 3 Highlights: బ్యాటింగ్‌లోనూ అదరగొట్టిన కరీబియన్ జట్టు!
England vs West Indies 1st Test Day 3 Highlights: ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో విండీస్ జట్టు పూర్తి ఆధిపత్యం కనబరుస్తుంది.
England vs West Indies 1st Test Day 3 Highlights: ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో విండీస్ జట్టు పూర్తి ఆధిపత్యం కనబరుస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో అతిధ్య జట్టును 204 పరుగులకి కట్టడి చేసిన ఆ జట్టు అటు బ్యాటింగ్ లోనూ ఆదరగొట్టింది.. తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేసి 114 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లాడ్ బ్యాట్స్ మేన్స్ లో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (65; 125 బంతుల్లో 6×4), వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ షేన్ డౌరిచ్ (61; 115 బంతుల్లో 8×4), ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ (47; 142 బంతుల్లో 6×4) రాణించారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ (4/49), అండర్సన్ (3/62) వికెట్లు తీశారు.. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు మూడో రోజు ఆట ముగుసే సమయానికి వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది..
పూర్తి ఆధిపత్యం ఇలా :
ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ ను ఓడించడం అంటే అది మాములు విషయం కాదు.. అందులో విండీస్ జట్టుకు ఇంకా అది అసాద్యం .. ఇది టూర్ కి ముందు క్రికెట్ విశ్లేషకులు భావించిన అంశాలు.. కానీ ఇప్పుడు పరిస్థితి విరుద్ధంగా కనిపిస్తోంది.. విండీస్ జట్టు మూడో రోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది..261 పరుగులకి గాను 9 వికెట్లను సమర్పించుకుంది.. ఓవర్ నైట్ స్కోర్ 57/1తో మూడో రోజు ఆటను మొదలుపెట్టిన విండీస్ జట్టు బ్యాట్స్‌మెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్, షై హోప్ 100 పరుగులు దాటించారు..గంటన్నర తర్వాత ఇంగ్లాండ్ జట్టు వీరిని విడదీసింది..తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రూక్స్ ఆత్మవిశ్వాసంతో ఆడాడు.. దీనితో విండీస్ జట్టు భారీ స్కోర్ సాధించడం ఖాయం అని అందరూ అనుకున్నారు.. కానీ కెప్టెన్ కెప్టెన్ స్టోక్స్ రంగంలోకి దిగి బ్రాత్‌వైట్‌ను వెనక్కి పంపాడు..
లంచ్ విరామం తర్వాత పుంజుకున్న ఇంగ్లాండ్..
లంచ్ విరామం తర్వాత ఇంగ్లాండ్ జట్టు పుంజుకుంది.71 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది విండీస్ జట్టు.. ఆ తర్వాత జట్టును రోస్టన్ చేజ్, డౌరిచ్ ఆదుకునే ప్రయత్నం చేశారు..ఇక 267/5 దగ్గర చేజ్ ఔట్ అవ్వడంతో ఆట మలుపు తిరిగింది.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మేన్స్ వచ్చినట్లే వచ్చి వెనుదిరిగారు.. దీనితో విండీస్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది.