England vs West Indies 1st Test, Day 2 Highlights: నిలకడగా ఆడుతున్న విండిస్...
England vs West Indies 1st Test, Day 2 Highlights: ఆఫ్టర్ కరోనా తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు మొదలయ్యాయి..
England vs West Indies 1st Test, Day 2 Highlights: ఆఫ్టర్ కరోనా తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు మొదలయ్యాయి.. ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో విండిస్ జట్టు నిలకడగా ఆడుతూ ఆదిత్య జట్టు పైన ఆధిపత్యం చెలాయిస్తుంది.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 19.3 ఓవర్లలలో ఒక వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో బ్రాత్ వైట్ 20,షై హోప్ 3 పరుగులతో ఉన్నారు. ఇక క్యాంప్బెల్ అవుట్ 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 35/1తో రెండో రోజు ఆటను మొదలు పెట్టిన ఇంగ్లాండ్ జట్టు తొందరనే నాలుగు వికెట్లను చేయిజార్చుకుంది.. ఈ క్రమంలో 81 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. దీనితో ఇంగ్లాండ్ స్టాండింగ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ (43), జోస్ బట్లర్ (35)తో కలిసి జట్టును ఆదుకున్నారు.. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 67 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వీరి భాగస్వామ్యన్ని హోల్డర్ 154 పరుగుల వద్ద విడదీశాడు. దీనితో ఇంగ్లాండ్ జట్టు ఈ మాత్రం స్కోర్ అయిన చేయగలిగింది.
టీ బ్రేక్ అనంతరం తమ ఫస్ట్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన విండిస్ జట్టు వికెట్లు కోల్పోకుండా నిలకడగా ఆడింది. ఓపెనర్లు బ్రాత్ వైట్, క్యాంప్బెల్ ఇద్దరు కలిసి మొదటి వికెట్ కి గాను 43 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ నేపధ్యంలో అండర్సన్ బౌలింగ్ లో అంపైర్ లు రెండు సార్లు ఎల్బీ ఇచ్చిన బతికిపోయిన క్యాంప్బెల్ మూడో రివ్యూలో మాత్రం వెనుదిరిగక తప్పలేదు. ఇక అ తర్వాత వచ్చిన హోప్ 3 పరుగులతో మరో ఓపెనర్ బ్రాత్ వైట్ తో క్రీజ్ లో ఉన్నాడు. ఇక ఇంగ్లాండ్ లో ప్రస్తుతం ఉన్న వాతావరణం ప్రకారం మ్యాచ్ కి మూడో రోజు మ్యాచ్ కి మరోసారి వరుణుడు అడ్డు పడే అవకాశం ఉంది.