England vs West Indies 1st Test, Day 2 Highlights : మొదటి ఇన్నింగ్స్ లో కుప్పకూలిన ఇంగ్లాండ్.. 204 పరుగులకి ఆలౌట్!

England vs West Indies 1st Test, Day 2 Highlights : ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు కుప్పకూలిపోయింది.

Update: 2020-07-09 16:24 GMT
Jason Holder picked a five-wicket haul against England

England vs West Indies 1st Test, Day 2 Highlights : ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు కుప్పకూలిపోయింది. విండిస్ బౌలర్ల దాటికి విలవిలలాడిపోయింది. 67.3 ఓవర్లకు గాను కేవలం 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఇంగ్లాండ్ జట్టులో స్టాండ్-ఇన్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక్కడే 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 35/1తో రెండో రోజు ఆటను మొదలు పెట్టిన ఇంగ్లాండ్ జట్టు సేపటికే జో డెన్లీ (18; 58 బంతుల్లో 4×4) రూపంలో మరో వికెట్ కోల్పోయింది.

ఆ తర్వాత క్రీజ్ లో నిలదొక్కుకుంటూ ఆడుతున్న ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (30; 85 బంతుల్లో 4×4)ను సైతం వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత విండీస్‌ కెప్టెన్ హోల్డర్‌ వికెట్ల పతనం మొదలుపెట్టాడు. జాక్‌ క్రాలీ (10; 26 బంతుల్లో 2×4), ఒలివ్‌ పోప్‌ (12; 13 బంతుల్లో 2×4)ను పెవిలియన్‌ పంపించాడు. దీనితో ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో పది వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేసింది. విండిస్ బౌలర్లలలో జేసన్ హోల్డర్‌ (6/42), షానన్‌ గాబ్రియేల్‌ (4/62) వికెట్లు తీశారు.

వారి భాగస్వామ్యం కీలకం :

87 పరుగులకి అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బెన్‌స్టోక్స్‌ (43), జోస్‌ బట్లర్‌ (35)తో కలిసి ఆదుకున్నారు.. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 67 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వీరి భాగస్వామ్యన్ని హోల్డర్‌ 154 పరుగుల వద్ద విడదీశాడు. దీనితో ఇంగ్లాండ్ జట్టు ఈ మాత్రం స్కోర్ అయిన చేయగలిగింది.

ఇక వెస్టిండిస్ తన మొదటి ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ప్రస్తుతం క్రీజ్ లో బ్రాత్‌వైట్: 5* (19), క్యాంప్బెల్: 8* (10) పరుగులతో కొనసాగుతున్నారు. విండిస్ స్కోర్ 21 గా ఉంది.

Tags:    

Similar News