England vs West Indies 1st Test, Day 1 Highlights: మొదటి టెస్టుకు వాన అంతరాయం.. తొలిరోజు ఇంగ్లాండ్ 35/1
England vs West Indies 1st Test, Day 1 Highlights: దాదాపుగా మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు మొదలయ్యాయి.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నిన్న మొదలైంది.
England vs West Indies 1st Test, Day 1 Highlights: దాదాపుగా మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు మొదలయ్యాయి.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నిన్న మొదలైంది.. అయితే ఆటకు వరుణుడు ప్రతి సారి అడ్డుపడుతూ వచ్చాడు... దీనితో ఇరు జట్ల మధ్య మ్యాచ్ పడుతూ లేస్తూనే సాగింది.. దీనితో మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 17.4 ఓవర్ల కి గాను.. ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది.. అయితే అంతకుముందు ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో మ్యాచ్ షెడ్యూల్ కన్నా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం అయింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తొలి బంతి పడింది. సరిగ్గా 3 ఓవర్లు సాగగానే వర్షంతో ఆట ఆగిపోయింది.
ఇందులో ముందుగా ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. అయితే ఆ జట్టు పరుగుల ఖాతా తెరవకముందే డొమినిక్ సిబ్లీ (0; 4 బంతుల్లో) ఔట్ అయ్యాడు...ఇక ఆ తరవాత మ్యాచ్ కి వరుణుడు మరో సారి మ్యాచ్ కి అడ్డం పడ్డాడు.. దీనితో కవర్లతో కప్పారు.. ఆ తరవాత వర్షం తగ్గడంతో మళ్ళీ మ్యాచ్ ని ప్రారంభించారు.. ఇక ఇంగ్లాడ్ బ్యాట్స్ మేన్స్..రోరీ బర్న్స్ (55 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు), డెన్లీ (48 బంతుల్లో 14 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో పాతుకుపోయారు.. ఈ జోడిని విడదీయడానికి విండీస్ బౌలర్లు బాగానే కృషి చేశారు. దీనితో ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 17.4 ఓవర్ల కి గాను.. ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది..ఇక రెండోరోజు ఆటకు కూడా వరుణుడు అడ్డుపడే అవకాశం ఉంది..
ఇక ఈ మ్యాచ్ లో అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపంగా మ్యాచ్‌కి ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని నిరసనను ప్రదర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వీరందరూ 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' లోగో ముద్రించి ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు..