England vs Pakistan Test Series: కోవిడ్ నిబందనలను మర్చిపోయి ఏం చేసారో తెలుసా?
England vs Pakistan Test Series: కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా దాదాపుగా మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు మొదలయ్యాయి..
England vs Pakistan Test Series: కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా దాదాపుగా మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు మొదలయ్యాయి.. జూలై నెలలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లమధ్య తొలి టెస్ట్ టెస్ట్ సిరీస్ మొదలైంది.. ఆ సిరీస్ అనంతరం సుమారు నెల రోజుల తరువాత మళ్ళి ఇంగ్లాండ్, పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ మొదలయింది. అయితే, ప్రస్తుత్తం కరోనా వైరస్ నేపద్యంలో ఐసీసీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతీ ఒక్క ఆటగాడు పాటించడంతో పాటు.. కరచాలనం చేయటం, బంతికి ఉమ్ము రాయటం, హత్తుకోవటం వంటివి చేయరాదని తెలిపింది. అటువంటి నిబందనలతోనే గత నెలలో వెస్టిండీస్‌తో మూడు టెస్ట్ల సిరీస్ మ్యాచ్ ను నిర్వహించి దిగ్విజయంగా పూర్తి చేసింది. మళ్ళి అదే ఉత్సాహంతో ఇప్పుడు ఇంగ్లాండ్ పాకిస్తాన్ తో మరో మూడు టెస్టుల సిరీస్ నిర్వహించేందుకు సిద్ధమైంది.
అయితే, మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన టాస్ కార్యక్రమంలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్ల కెప్టెన్ లు కోవిడ్ నిబందనలను అతిక్రమించాబోయారు.. గతంలో మాదిరిగా అలవాటులో పొరపాటుగా కరచాలనం చేసుకున్నారు. అంతే కాదు గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కుడా ఇదే మాదిరిగా ఆ జట్టు సారథి జేసన్ హోల్డర్, ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఇదేమాదిరిగా వ్యవహిరంచి కోవిడ్ నిబందాలను అతిక్రమించారు. పొరపాటుగా చేతులు కలపడానికి ప్రయత్నించి వెంటనే వెనక్కి తప్పుకొని కరచాలనం ఇచ్చుకోకుండా వెనుతిరిగారు. ఇక టాస్ గెలిచి తోలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ అరంబంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అబిద్ అలీ(16), కెప్టెన్ అజర్ అలీని(0) ఎల్బీడబ్ల్యూ గా వేనిదిరిగాడు. ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, క్రిస్‌వోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లకే 44/2తో కొనసాగుతోంది.