England umpires 5 wrong calls against West Indies: ఇద్దరు అంపైర్లు.. ఐదు తప్పులు.. పలు అనుమానాలు!

England umpires 5 wrong calls against West Indies: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 117 రోజుల విరామం తర్వాత మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు మొదలయ్యాయి. ఇది సంతోషించాల్సిన విషయమే

Update: 2020-07-10 16:26 GMT
England umpires 5 wrong calls against West Indies in the first Test

England umpires 5 wrong calls against West Indies: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 117 రోజుల విరామం తర్వాత మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు మొదలయ్యాయి. ఇది సంతోషించాల్సిన విషయమే.. అయితే ఐసీసీ తీసుకువచ్చిన కొత్త నిబంధనల మాత్రం కొత్త తలనొప్పులను తీసుకువస్తుంది. బౌలర్లు బంతికి మెరుపు తీసుకురావడానికి బంతిపైన లాలాజలం రాయొద్దని, అలాగే మ్యాచ్‌లు నిర్వహించే దేశం స్థానిక అంపైర్లను వినియోగించుకోవాలని ఐసీసీ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. అయితే ఇంగ్లాండ్ , వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ కి గాను ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ రిచర్డ్‌ కెటిల్‌బారో, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ అనే ఇద్దరు అంపైర్లను నియమించుకుంది.

మొదటిరోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు విండిస్ బౌలర్ల దాటికి 204 పరుగుల మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అయితే, ముగ్గురు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ ఎల్బీడబ్ల్యూగా ఔటైనా రిచర్డ్‌ కెటిల్‌బారో మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. దీనితో విండీస్‌ జట్టు డీఆర్‌ఎస్‌కు వెళ్ళడంతో అక్కడ ఆ అంపైర్‌ నిర్ణయాలు తప్పుగా తేలాయి.. మొదటగా షానన్‌ గాబ్రియల్‌ బౌలింగ్‌లో రోరీ బర్న్స్‌ ఎల్బీగా ఔటైనా అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. ఇది జరిగిన 7 ఓవర్ల తర్వాత మళ్లీ హోల్డర్‌ బౌలింగ్‌లో ఇంకో ఎల్బీని అవ్వగా అది నాటౌట్‌ గానే ప్రకటించాడు. ఇక మరోసారి 58వ ఓవర్‌లో హోల్డర్‌ బౌలింగ్‌లోనే ఆర్చర్‌ ఎల్బీ అయినా అది కూడా అంపైర్‌ నాటౌటిచ్చాడు. దీనితో మూడుసార్లు రిచర్డ్‌ కెటిల్‌బారో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు.

ఇక వెస్టిండిస్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ సారి సమస్య మరో అంపైర్‌ ఇల్లింగ్‌వర్త్‌ నుంచి వచ్చింది. ఇంగ్లాండ్ బౌలర్ ఆండర్సన్‌ బౌలింగ్‌లో రెండుసార్లు జాన్‌ క్యాంప్‌బెల్‌ను ఎల్బీగా ఔటిచ్చాడు. అవి కూడా రెండు తప్పుడు నిర్ణయాలేనని తేలిపోయాయి.. అనుభవజ్ఞులు అయిన ఈ ఇద్దరు అంపైర్లు ఒక్క మ్యాచ్ లో అయిదు తప్పులు చేయడం పలు అనుమానాలకి దారి తీస్తుంది.   

Tags:    

Similar News