Ind vs Pak: భారత్‌-పాక్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉంటది.. షాకిస్తోన్న విమాన ఛార్జీలు.. ఎలా ఉన్నాయంటే?

ICC World Cup 2023: క్రికెట్ అభిమానుల అభిరుచి దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉంది.

Update: 2023-07-18 06:57 GMT

Ind vs Pak: భారత్‌-పాక్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉంటది.. షాకిస్తోన్న విమాన ఛార్జీలు.. ఎలా ఉన్నాయంటే?

India Vs Pakistan Match: క్రికెట్ అభిమానుల అభిరుచి దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉంది. ఇక భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించే అయితే ఆ ఉత్కంఠ మరో స్థాయిలో ఉంటుంది. ఈ ఏడాది క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ (India Vs Pakistan) అక్టోబర్‌లో అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో విమాన చార్జీల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వన్‌వే నాన్‌స్టాప్ ఎకానమీ క్లాస్ ధర రూ.9,011 నుంచి రూ.24,000 మధ్యకు చేరుకుంది. దీన్ని బట్టి మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో ఊహించవచ్చు. MakeMyTrip, ixigo ప్రకారం, ముంబై నుంచి అహ్మదాబాద్‌కు వన్ వే నాన్ స్టాప్ ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టిక్కెట్ల ధర రూ.10,517, రూ.24,189లు నిలిచింది.

విమాన టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్..

ఇరు దేశాల మధ్య మ్యాచ్ సందర్భంగా విమాన టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. విమాన టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో టిక్కెట్ ధరలో విపరీతమైన పెరుగుదల కనిపించడానికి కారణం ఇదే. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఈస్‌మైట్రిప్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు నిషాంత్ పిట్టి మాట్లాడుతూ.. 'మా వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు విమాన టిక్కెట్‌ల కోసం వెతుకుతున్న వారి సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. మ్యాచ్‌ని చూసేందుకు సిద్ధంగా ఉన్నవారు ఇప్పటికే టిక్కెట్ల బుకింగ్‌ను ప్రారంభించారు.

10 రెట్లు పెరిగిన హోటల్ గది అద్దె..

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా విమాన ఛార్జీలు ఆకాశాన్ని తాకడమే కాకుండా, అహ్మదాబాద్‌లోని హోటల్ గది అద్దె కూడా 10 రెట్లు పెరిగింది. లగ్జరీ హోటళ్లలో ఒక్క రాత్రికి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు అద్దె వసూలు చేస్తున్నారు. చాలా హోటళ్లు ఇప్పటికే అక్టోబర్ 15కి టిక్కెట్లు బుక్ చేసుకున్నాయి. ITC నర్మదా, కోర్ట్ యార్డ్ బై మారియట్, హయత్, తాజ్ స్కైలైన్ అహ్మదాబాద్‌లో అక్టోబర్ 15న అద్దెకు గదులు అందుబాటులో లేవు.

విలాసవంతమైన హోటళ్లలో సాధారణ రోజుల్లో రూ.5,000 నుంచి రూ.8,000 వరకు గది అద్దె ఉంటుంది. చాలా మంది ఎన్నారైలు, ఎగువ మధ్యతరగతి క్రికెట్ అభిమానుల డిమాండ్ మేరకు హోటళ్ల రేటు పెరిగిందని గుజరాత్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌ఏ) అధ్యక్షుడు నరేంద్ర సోమాని తెలిపారు.

Tags:    

Similar News