ఐపీఎల్ 13 : బీసీసీఐకి వచ్చిన లాభం ఎంతో తెలుసా?
ముందుగా టోర్నీ నిర్వహణ పై చాలా అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. అయితే తమలో ప్రధాన కార్యదర్శి జైషా దైర్యం నింపారని చెప్పుకొచ్చారు. అలా టోర్నీ నిర్వహణకు ముందుకు వెళ్ళిన తమకి చెన్నై జట్టులో కరోనా కేసులు తేలడంతో కాస్త ఆలోచించామన్నారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మధ్య ఐపీఎల్ లాంటి మెగా టీ20 టోర్నీని నియమించి అందరి చేత శభాష్ అనిపించుకుంది బీసీసీఐ. అయితే ఎప్పుడు సమ్మర్లో జరిగే ఈ మెగా టోర్నీ ఈ ఏడాది కరోనా వలన అక్టోబర్, నవంబర్ నెలలలో జరిగింది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది యూఏఈలో ఈ టోర్నీని నిర్వహించారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 50 రోజుల పాటు ఈ టోర్నీ ప్రేక్షకులను అలరించింది.
ప్రేక్షకులు లేకపోవడంతో స్టేడియంలు వెలవెలబోయాయి. అయితే ఆ కొరతను తీర్చేందుకు టోర్నీనిర్వాహకులు వర్చువల్ పద్ధతిలో ఉత్సాహపరిచారు. ఇక ఈ సీజన్ వలన బీసీసీఐ మంచి ఆదాయాన్ని పొందినట్లుగా బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించారు. తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ.. టోర్నీ నిర్వహణ, దాని ఆదాయంపై స్పందించారు.
ముందుగా టోర్నీ నిర్వహణ పై చాలా అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. అయితే తమలో ప్రధాన కార్యదర్శి జైషా దైర్యం నింపారని చెప్పుకొచ్చారు. అలా టోర్నీ నిర్వహణకు ముందుకు వెళ్ళిన తమకి చెన్నై జట్టులో కరోనా కేసులు తేలడంతో కాస్త ఆలోచించామన్నారు. అయితే వారికి లక్షణాలేమి కనిపించకపోవడంతో ఐసోలేషన్‌లో ఉంచామని, తర్వాత ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించామని చెప్పారు. ఇక ఈ టోర్నీ వలన బీసీసీఐ నాలుగు వేల కోట్ల ఆదాయం పొందిందని వెల్లడించారు. ఇక గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ, డిజిటల్ మాధ్యమాల వీక్షకుల సంఖ్య 25 శాతం పెరిగిందని వెల్లడించారు.