Dhoni retirement: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ!

Dhoni retirement: ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన వార్త సంచలనం సృష్టిస్తోంది.

Update: 2020-08-15 14:58 GMT
MS Dhoni retirement

మహేంద్ర సింగ్ ధోనీ..ఈ పేరు భారత క్రికెట్ లో కొత్త చరిత్ర సృష్టించింది. తన ఆట.. మాట.. నడవడిక అన్నీ భారత క్రికెట్లో ఓ ప్రత్యేకత తో నిలబెట్టాయి. ధోనీ హెలికాఫ్టర్ షాట్.. పొడవాటి జుట్టు.. కత్తిరించుకున్న జుట్టు.. మైదానంలో సృష్టించిన పరుగులు.. కెప్టెన్ గా కూల్ నడవడిక.. గెలువులు.. ఓటములు.. ఇలా ఏదైనా కొన్నీళ్ళుగా భారత క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశాలుగానే నిలిచాయి. 

ఇక కొద్దికాలంగా ధోనీ క్రికెట్ నుంచి రిటైర్ అవుతారనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఎప్పటికప్పుడు ఆ వార్తలకు చెక్ పడుతూనే వస్తోంది. అయితే, ఇప్పుడు ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారని వార్తా ANI వార్తా సంస్థ తన ట్విట్టర్ లో పేర్కొంది. తన ట్విట్టర్ ద్వారా న్యూస్ ఫ్లాష్ గా ఈ విషయాన్ని ప్రకటించింది.

 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. దాదాపు ఏడాదికాలంగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ని కూడా చేజార్చుకున్న ఈ మాజీ కెప్టెన్ ప్రస్తుతం చెన్నైలో ఐపీఎల్ 2020 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. రాంచీ నుంచి ఛార్టర్డ్ ప్లైట్‌లో శుక్రవారం అక్కడికి వెళ్లిన ధోనీ.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌కి హాజరైన గంటల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించినట్టు తెలుస్తోంది.

 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కానీ.. ఆ టోర్నీ ముగిసిన తర్వాత ఆర్మీలో కొన్ని రోజులు పనిచేసిన ధోనీ.. ఆ తర్వాత టీమిండియా సెలక్షన్‌కి దూరంగా ఉండిపోయాడు. 


Tags:    

Similar News