Devon Conway: తొలిమ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ.. రికార్డులను బ్రేక్ చేసిన డెవాన్‌ కాన్వే

Devon Conway: కివీస్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ డెవాన్‌ కాన్వే అద్భుత ఇన్నింగ్స్‌తో దుమ్ము రేపాడు.

Update: 2021-06-03 16:41 GMT

డెవాన్‌ కాన్వే (ఫొటో ట్విట్టర్)

Devon Conway: కివీస్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ డెవాన్‌ కాన్వే అద్భుత ఇన్నింగ్స్‌తో దుమ్ము రేపాడు. తొలి మ్యాచ్‌తోనే ప్రపంచ క్రికెట్‌ దృష్టిని ఆకర్శించాడు ఈ యంగ్ బ్యాట్స్‌మెన్. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ సాధించి, రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో టిప్‌ ఫోస్టర్‌(287), జాక్‌ రుడాల్ఫ్‌(222*), లారెన్స్‌ రోవ్‌(214), మాథ్యూ సింక్లెయిర్‌(214), బ్రెండన్‌ కురుప్పు(201*)లు టెస్ట్‌ డెబ్యూలో డబుల్‌ సెంచరీ బాదారు.

మాథ్యూ సింక్లెయిర్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో న్యూజిలాండ్‌ ఆటగాడిగా కాన్వే రికార్డు సాధించాడు. ఈ సూపర్‌ ఇన్నింగ్స్‌తో కాన్వే మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ డెబ్యూలో బౌండరీతో సెంచరీని, సిక్సర్‌తో ద్విశతకాన్ని సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రపుటల్లోకి ఎక్కాడు. అయితే, తొలి రోజు ఆటలో లార్డ్స్‌ మైదానంలో గంగూలీ 25 ఏళ్ల కిందట నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టిన కాన్వే.. తాజాగా డబుల్‌ సెంచరీ సాధించి అరుదైన క్రికెటర్ల క్లబ్‌లోకి చేరాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో కాన్వే(347 బంతుల్లో 200; 22 ఫోర్లు, సిక్స్‌) ఒక్కడే ద్విశతకం నిలిచాడు. దీంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. మిగతా బ్యాట్స్‌మెన్స్‌లో హెన్నీ నికోల్స్‌(61), నీల్‌ వాగ్నర్‌(25 నాటౌట్‌) ఆడడంతో కివీస్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో అరంగేట్రం బౌలర్‌ రాబిన్సన్‌ 4 వికెట్లు పడగొట్టగా, మార్క్‌ వుడ్‌ 3, అండర్సన్‌ 2 వికెట్లు పడగొట్టారు.


Tags:    

Similar News