Delhi Capitals : ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ ఒక్కటే అలా..

Delhi Capitals : మరో రెండు వారాల్లో ఐపీఎల్‌ పదమూడవ సీజన్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19న మొదటి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌ కి

Update: 2020-09-06 10:58 GMT

Delhi Capitals 

Delhi Capitals : మరో రెండు వారాల్లో ఐపీఎల్‌ పదమూడవ సీజన్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19న మొదటి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌ కి సంబంధించిన పూర్తి షెడ్యుల్ ని బీసీసీఐ ఈ రోజు (ఆదివారం) విడుదల చేయనుంది. ఇక ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చెసుకున్న జట్లు ప్రాక్టిస్ ను కూడా మొదలు పెట్టేశాయి. ఇక ఇది ఇలా ఉంటే ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం జట్టులో నలుగురు విదేశీ ఆటగాల్లు మాత్రమే ఉండాలి. అంతకన్నా తక్కువ ఉన్న పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం ఉండకూడదు..

అయితే ఢిల్లీ జట్టులో మాత్రం ఈ సారి తుది జట్టులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌చోప్రా వెల్లడించాడు. అభిమానులతో చిట్ చాట్ చేసిన ఆకాశ్‌చోప్రాను ఓ నేపాలీ నెటిజన్ ఈ విధంగా ప్రశ్నించాడు.. " ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్న నలుగురు స్పిన్నర్లలో (అమిత్‌ మిశ్రా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, సందీప్‌ లామిచ్చనే) రెగ్యులర్‌గా ఆడే ఇద్దరు ఎవరుంటారు" అని ప్రశ్నించాడు.

అయితే దీనికి ఆకాశ్‌చోప్రా స్పందిస్తూ.. ఇందులో అశ్విన్‌, అక్షర్‌ బౌలింగ్ తో పాటుగా బ్యాటింగ్ కూడా చేయగలరు.. ఇక మిశ్రా, సందీప్‌ రెగ్యులర్ బౌలర్లు. కాబట్టి ఢిల్లీ జట్టు ముగ్గురు స్పినర్లతో బరిలోకి దిగ్గుతుంది. ఒక్కోసారి నలుగురు కూడా ఉండొచ్చు.. అయితే అశ్విన్‌ మాత్రం కీలకమని, ముగ్గుర్లో ఎవరైనా ఇద్దరు స్పిన్నర్లు ఆడే అవకాశం ఉందని చోప్రా పేర్కొన్నాడు. ఇక గత ఏడాది కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌కు కెప్టెన్‌గా ఉన్న అశ్విన్ ఈ ఏడాది ఢిల్లీ జట్టు అతన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ జట్టుకి అశ్విన్ కీలకం కానున్నాడు. 

Tags:    

Similar News