భారత్ ఓటమి.. ట్రెండింగ్ లో రోహిత్ శర్మ!

వన్డేలో టీంఇండియా ఓటమి పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా అయిదు వన్డేల్లో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ ఏడాది న్యూజిలాండ్ చేతిలో మూడు వన్డేల్లో భారత జట్టు ఓటమి పాలు కాగా, తాజాగా ఆస్ట్రేలియా చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయింది.

Update: 2020-11-29 13:43 GMT

వన్డేలో టీంఇండియా ఓటమి పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా అయిదు వన్డేల్లో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ ఏడాది న్యూజిలాండ్ చేతిలో మూడు వన్డేల్లో భారత జట్టు ఓటమి పాలు కాగా, తాజాగా ఆస్ట్రేలియా చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని ఆసీస్ కి అప్పజెప్పింది టీంఇండియా. అయితే ఈ రెండు వన్డేల్లో వరుసగా 370కి మించి పరుగులు ఇవ్వడం కలవరపెడుతుంది. బ్యాటింగ్ పరంగా ఒకే అనిపించినా బౌలింగ్ విభాగంలో మాత్రం టీంఇండియా దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పాలి.

ఆస్ట్రేలియా చేతిలో వరుసగా రెండు వన్డేల్లో భారత్ ఓటమి పాలు కావడంతో టీంఇండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ పేరు మళ్ళీ తెరపైకి వచ్చింది. #Rohitsharma హాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. వన్డేల్లో, టీట్వంటీలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి కెప్టెన్ గా అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రోహిత్ శర్మ సలహాలు జట్టుకు ఎంతో ఉపయోగకరమని ఫ్యాన్స్ అంటున్నారు. అటు టీంఇండియా ఓడిన చివరి ఎనమిది వన్డేలలో రోహిత్ శర్మ లేకపోవడం గమనార్హం. ఈ ఏడాదిలో జరిగిన ఐపీఎల్ సీజన్ లో ముంబై జట్టును విజేతగా నిలబెట్టాడు రోహిత్.

Tags:    

Similar News