IPL 2022 - Coronavirus: ఐపీఎల్‌లో కరోనా కలకలం.. ఢిల్లీ సభ్యుడికి కరోనా...
IPL 2022 - Coronavirus: *పూణె వెళ్లడానికి జట్టుకు ఇబ్బందులు *హోటల్‌లోనే బస చేస్తోన్న టీం సభ్యులు
IPL 2022 - Coronavirus: ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals) లో కరోనా కలకలం రేగింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌కు కోవిడ్ సోకింది. బుధవారం పంజాబ్ కింగ్స్(Punjab Kings) తో ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ విషయంలో సందిగ్ధతనెలకొంది. దీంతో జట్టు సభ్యులు పూణె వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్ జట్టు సభ్యులు ముంబై హోటల్లోనే ఉంచి టెస్టులు నిర్వహిస్తున్నారు. కరోనా సింప్టమ్స్ ఉండటంతో... ఆస్ట్రేలియా(Australia) ఆల్‌రౌండర్‌కు పరీక్షలు చేయడంతో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ నిర్ధారణయ్యింది.
మరో సపోర్టింగ్ స్టాఫ్‌లో సైతం కరోనా లక్షణాలు ఉండటంతో.. టీం సభ్యులు టెన్షన్ పడుతున్నారు. ఇంకెవరికైనా వ్యాధి సోకి ఉంటుందేమోనన్న కోణంలోనూ... టీం సభ్యులందరికీ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో బుధవారం జరగాల్సిన మ్యాచ్‌లో... కోవిడ్ నెగిటివ్ వచ్చినవారిని మాత్రమే అనుమతిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. గత వారం ఢిల్లీ కేపిటల్స్ కు చెందిన ఫిజియో ఫర్హార్ట్ కోవిడ్(Covid-19) బారినపడటం... తాజాగా ఆదే జట్టులో మరొకరికి వ్యాధి సోకడంతో ఆందోళన నెలకొంది. ఢిల్లీ జట్టులో మరో ఆటగాడు సైతం కరోనా సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.
ఆటగాళ్లు కరోనా(Coronavirus) బారిన పడకుండా ఉండేందుకు బయోబబుల్‌లో ఉంచి.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ... కొందరు కరోనా బారినపడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ సజావుగా సాగుతున్నా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. రేపేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది ఐపీఎల్(IPL) నిర్వహణ సమయంలో కరోనా ఒక్కసారిగా విజృంభించడంతో మిగతా మ్యాచ్‌లను యూఏఈకి మర్చారు.