Tokyo Olympics: కరోనా వాకిట్లో టోక్యో ఒలింపిక్స్

దాదాపుగా 200 కి పైగా దేశాలకి సంబందించిన క్రీడాకారులు పాల్గొననున్న టోక్యో ఒలింపిక్స్ కి ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది.

Update: 2021-07-01 10:47 GMT

టోక్యో ఒలింపిక్స్ (ఫైల్ ఫోటో)

Tokyo Olympics: దాదాపుగా 200 కి పైగా దేశాలకి సంబందించిన క్రీడాకారులు పాల్గొననున్న టోక్యో ఒలింపిక్స్ కి ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. విదేశాల నుండి వస్తున్న క్రీడాకారులకి కరోనా వాక్సినేషన్ తప్పనిసరి చేసిన టోక్యో ప్రాంతంలో ప్రస్తుతం పుట్టుకొస్తున్న కరోనా కేసులు మరియు ఆ దేశం జపాన్ లో ప్రస్తుతం ఉన్న పాజిటివ్ కేసులతో ఒలింపిక్స్ నిర్వాహకులు మరియు క్రీడాకారులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 23 నుండి ప్రారంభం అయి ఆగష్టు నెల 8 తేదీ వరకు ఒలింపిక్ గేమ్స్ జరగనున్నాయి. గడిచిన 24 గంటల్లో టోక్యో ప్రాంతంలో 714 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అధికారికంగా ప్రకటించారు.

గత నెల 21 వరకు షరతులతో కూడిన లాక్ డౌన్ ని విధించిన ప్రభుత్వం ఆ తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తిగా లాక్ డౌన్ ని ఎత్తివేసింది. మరోపక్క జపాన్ పౌరులు మాత్రం ఇప్పట్లో ఒలింపిక్స్ నిర్వహించవద్దని ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒలింపిక్స్ ని కొనసాగితే మున్ముందు జపాన్ ప్రజలు కొత్త వేరియంట్ వైరస్ లతో ఇబ్బంది పడాల్సి వస్తుందని నిరసన తెలుపుతున్నారు.

ఇక భారత్ నుండి 74 మంది క్రీడాకారులు ఇప్పటికే ఒలింపిక్స్ కి అర్హత సాధించారు. భారత్ నుండి టెన్నిస్ లో సానియా మీర్జా, రోవింగ్ లో అర్జున్ లాల్, అరవింద్ సింగ్, జూడో నుండి సుశీలా దేవి, జిమ్నాస్టిక్స్ నుండి ప్రణతి నాయక్, బాడ్మింటన్ నుండి పివి సింధు ఇలా దాదాపుగా 14 క్రీడల నుండి మనవాళ్ళు టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొననున్నారు. గత ఏడాది జరగవలసిన ఈ ఒలింపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.. మరి ఈ ఏడాది అయినా నిర్వాహకులు కరోనాని జయించి ఒలింపిక్స్ ని నిర్వహిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News