India Vs Pakistan: ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ .. టీవీలు ప‌గిలిపోవాల్సిందే..!

Update: 2021-10-24 06:58 GMT

Ind vs Pak: ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ .. టీవీలు ప‌గిలిపోవాల్సిందే..!

India Vs Pakistan T20 World Cup 2021: భార‌త్‌, పాక్ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతుందంటే క్రికెట్ అభిమానులు యుద్దంలా భావిస్తారు. ఎన్ని ప‌నులున్నా స‌రే అన్ని మానుకొని టీవీల‌కు అతుక్కుపోతారు. ఆస‌క్తిగా మ్యాచ్‌ని తిల‌కిస్తారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల్లో భార‌త్ అస్స‌లు ఓడిపోలేదు. ప్ర‌తిసారి పాకిస్తాన్ ఓడిపోవ‌డంతో ఆ దేశంలో ఎన్నో టీవీలు ప‌గిలిపోయాయి. కానీ ఈ సారి పాకిస్తాన్ అభిమానులు కొంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. పాకిస్తాన్ గెల‌వ‌డం కాయ‌మ‌ని ఇండియాలో టీవీలు ప‌గిలిపోతాయ‌ని జోస్యం చెబుతున్నారు. ఇందులో ఏది నిజ‌మో మ‌రి కొద్ది గంట‌ల్లో తేల‌నుంది.

ఇప్ప‌టికే ఇరు దేశాల అభిమానులు దుబాయ్ చేరుకున్నారు. నేటి మ్యాచ్ కోసం పాకిస్తాన్‌కు చెందిన బషీర్ చికాగో నుంచి దుబాయ్ చేరుకోగా, భారతదేశానికి చెందిన వీరాభిమాని సుధీర్ గౌతమ్ కూడా దుబాయ్‌కి వెళ్లారు. ఇద్ద‌రి మ‌ధ్య వివాదం త‌లెత్తింది. టీవీని ప‌గ‌ల‌గొట్టే విష‌య‌మై వాగ్వాదం జ‌రిగింది. పాకిస్తాన్ లో టీవీలు ప‌గిలిపోతాయ్ అని సుధీర్ అన‌డంతో.. బ‌షీర్ ఘాటుగా స్పందించాడు. ప్ర‌తిసారి పాకిస్తాన్‌లో ఎందుకు ప‌గిలిపోతాయ్ ఈ సారి ఇండియాలో ప‌గిలిపోతాయ‌ని అన్నాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లలో తరచుగా కలిసి కనిపించే ఈ ఇద్దరు అభిమానుల మ‌ధ్య గొడ‌వ‌ను అంద‌రు ఆస‌క్తిగా తిల‌కించ‌డం విశేషం.

టీ20 ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీంలు ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 5 మ్యాచుల్లో విజయం సాధించింది. మొత్తంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు జరిగిన 8 మ్యాచుల్లో భారత్ 7 , పాకిస్తాన్ 1 మ్యాచులో విజయం సాధించాయి. అలాగే భారత్ ఆడిన రెండు వార్మప్ మ్యాచుల్లో విజయం సాధించింది. అలాగే పాకిస్తాన్ మాత్రం ఒక మ్యాచులో విజయం సాధించి, మరో మ్యాచులో ఓడిపోయింది. టీమిండయా ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలకం కానుండగా, పాకిస్తాన్ తరపున బాబర్ అజం, షాహీన్ అఫ్రిదీ ఆకట్టుకోనున్నారు.

Full View


Tags:    

Similar News