IPL 2021: కరోనా విజృంభణ వేళ ఐపీఎల్‌పై కాంట్రవర్శీ.. తక్షణం ఆపాలంటూ..
IPL 2021: ఐపీఎల్ మెగా ఆక్షన్ 2022.. ఫ్యాన్స్ బుర్రలో ఎన్నో ప్రశ్నలు. ఏ టీమ్‌లో ఎవరు ఉంటారు..? ఏ టీమ్ ఎవరిని రీటైన్ చేసుకుంటుంది..?
IPL 2021: ఐపీఎల్ మెగా ఆక్షన్ 2022.. ఫ్యాన్స్ బుర్రలో ఎన్నో ప్రశ్నలు. ఏ టీమ్‌లో ఎవరు ఉంటారు..? ఏ టీమ్ ఎవరిని రీటైన్ చేసుకుంటుంది..? అనేది ఆసక్తికరంగా మారింది. చెప్పాలంటే రానున్న మెగా వేలానికి ప్రతి టీమ్ డైనమిక్స్ పూర్తిగా మారనుంది. ఈ క్రమంలో ఐపీఎల్ జట్లు ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
చెప్పాలంటే భారత్‌లో కరోనా విజృంభిస్తున్నా ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రం విజయవంతంగా కొనసాగుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ నుంచి వెళ్లి పోవాలని చూస్తున్నారు. అందుకు కారణంగా భారత్‌లో కరోనా విజృంభణయే అంటున్నారు ఆటగాళ్లు.
ఇప్పటికే ఆస్ట్రేలియా బౌలర్ ఆండ్రూ టై ఐపీఎల్‌ను విడిచిపెట్టాడు. టై రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. ఇక వ్యక్తిగత కారణాల వల్ల తాను ఐపీఎల్‌ను వీడితున్నట్టు టై చెప్పినా కరోనా భయంతోనే అతడు ఐపీఎల్‌ను వీడినట్టు సమాచారం. అదేవిధంగా ఇదే కారణంతో రాజస్థాన్ రాయల్స్ చెందిన మరో ఆటగాడు లియామ్ లివింగ్ స్టన్ కూడా ఐపీఎల్‌ను వీడినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని కీలక ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన కుటుంబ సభ్యులు కరోనాతో పోరాడుతున్నారని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా నిలవాల్సి ఉందని అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు. అశ్విన్ నిర్ణయంపై స్పందించిన యాజమాన్యం ఈ కష్ట సమయంలో అతడికి పూర్తిగా అండగా ఉంటామని సంఘీభావం ప్రకటించింది.
ఇక ఐపీఎల్ మ్యాచ్‌లు కొనసాగడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మ్యాచ్‌లు కొనసాగడం కరెక్ట్ అంటే కొందరు కరోనా సమయంలో ఈ మ్యాచ్‌లు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు క్రికిట్ అభిమానులైతే కరోనా సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని మ్యాచ్‌లు చూడొచ్చని తద్వారా కరోనా బారిన పడకుండా తప్పించుకోవచ్చంటున్నారు.
అటు భారత్‌లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్యను చూసి తమదేశ ఆటగాళ్లు భయపడుతున్నారన్నారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ హస్సీ. తమకు మ్యాచ్‌లకన్నా తమ ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమన్నారు. కరోనా సమయంలో ఇంతవరకు ఆడిన మ్యాచ్‌లు చాలంటూ వెనక్కి వచ్చేయాలని తమదేశ ఆటగాళ్లను వెనక్కి రావాలంటోంది ఆస్ట్రేలియా.
ఇదిలా ఉండగా ఈ ఐపీఎల్ సీజన్ నుంచి ఎవరు తప్పుకున్నా మ్యాచ్‌లు మాత్రం కొనసాగుతాయని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ ఆపితే కొందరు ఉద్యోగులు కోల్పోవాల్సి వస్తోందని అది తమకు నచ్చడం లేదని వెల్లడించింది. అంతేకాదు కరోనా విజృంభిస్తోన్న ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రం షెడ్యూల్ ప్రకారమే యధావిధిగా కొనసాగుతాయంటోంది. అయితే బీసీసీఐ నిర్ణయంతో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు.