బీసీసీఐకి కొత్త సెలక్షన్ కమిటీ.. మరోసారి ఛైర్మన్‌గా చేతన్‌కే అవకాశం..

బీసీసీఐకి కొత్త సెలక్షన్ కమిటీ.. మరోసారి ఛైర్మన్‌గా చేతన్‌కే అవకాశం..

Update: 2023-01-07 13:00 GMT

బీసీసీఐకి కొత్త సెలక్షన్ కమిటీ.. మరోసారి ఛైర్మన్‌గా చేతన్‌కే అవకాశం..

BCCI: బీసీసీఐకి కొత్త సెలక్షన్ కమిటీని నియమించింది. మరోసారి ఛైర్మన్‌గా చేతన్‌ శర్మను ఎంపిక చేశారు. సభ్యులుగా శివ్‌సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్‌ అంకోలా, శ్రీధరన్‌శరత్‌ను నియమించారు. బీసీసీఐ సెక్రటరీ జైషా వివరాలు వెల్లడించారు. కాగా టీ20 ప్రపంచకప్‌-2022లో రోహిత్‌ సేన దారుణ వైఫల్యం నేపథ్యంలో సెలక్షన్‌ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దాదాపు 50 మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ముఖాముఖిలు నిర్వహించి సెలెక్టర్ల జాబితాను బీసీసీఐకి అప్పగించింది. బాధ్యతలు చేపట్టే ఛైర్మన్‌కు ఏడాదికి రూ. 1.25 కోట్లు, సెలెక్టర్లకు రూ. కోటిను పారితోషికంగా బీసీసీఐ ఇవ్వనుంది.

Tags:    

Similar News