Chaminda Vaas : మూడు రోజుల క్రితమే నియామకం.. అప్పుడే రాజీనామా..!
Chaminda Vaas: శ్రీలంక బౌలింగ్ కోచ్ గా 3 రోజుల క్రితం ఎంపికైన చమిందా వాస్..అప్పుడే కోచింగ్ పదవికి గుడ్ బై చెప్పేశాడు.
Chaminda Vaas:శ్రీలంక టీమ్ బౌలింగ్ కోచ్ గా మూడు రోజుల క్రితం ఎంపికైన మాజీ దిగ్గజ బౌలర్ చమిందా వాస్..అప్పుడే కోచింగ్ పదవికి గుడ్ బై చెప్పేశాడు. నాటకీయమైన మలుపుల మధ్య చమిందా వాస్ కోచ్ పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మధ్య సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టూర్‌లలో శ్రీలంక టీమ్ ఫెయిల్ అవడంతో.. అప్పటి వరకూ బౌలింగ్ కోచ్‌గా ఉన్న డేవిడ్ సకర్‌ను తొలగించి గత వారమే బౌలింగ్ కోచ్ పదవిని వాస్‌కు అప్పగించింది లంక బోర్డు.
అయితే, సోమవారం రాత్రి శ్రీలంక టీమ్‌తో కలిసి చమిందా వాస్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సింది. కానీ, శ్రీలంక క్రికెట్ బోర్డుతో శాలరీ విషయంలో డీల్ కుదరకపోవడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. సరిగ్గా శ్రీలంక టీమ్ వెస్టిండీస్ టూర్‌కు బయలుదేరే ముందే ఆయన రాజీనామా చేయడంపై బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వెస్టిండీస్ టూర్ కు శ్రీలంక టీమ్ బయలుదేరే ముందే రాజీనామా చేయడం ఏంటని లంక బోర్డు అధికారి ప్రశ్నించారు.
శ్రీలంక సక్సెస్‌ఫుల్ పేస్‌బౌలర్ అయిన చమిందా వాస్.. టెస్టుల్లో 355, వన్డేల్లో 400 వికెట్లు తీశాడు. అలాంటి లెజెండరీ బౌలర్ ఇలా ఉన్నట్లుండి రాజీనామా చేయడంపై లంక బోర్డు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అయితే సోమవారం రాత్రి బయలుదేరిన లంక జట్టుకు దేశ క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతి లభించలేదు. టీ20 జట్టులో నలుగురు కొత్త ఆటగాళ్లు రమేష్ మెండిస్, దిల్షన్ మదుశంకా, పాతుమ్ నిస్సంకా తోపాటు అషేన్ బండారా చోటు దక్కించుకున్నారు.