కేంద్రం సంచలన నిర్ణయం.. భారత రెజ్లింగ్‌ సమాఖ్య నూతన బాడీ రద్దు

Wrestling: సస్పెండ్‌ చేసిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ

Update: 2023-12-24 08:15 GMT

కేంద్రం సంచలన నిర్ణయం.. భారత రెజ్లింగ్‌ సమాఖ్య నూతన బాడీ రద్దు

Wrestling: కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య నూతన బాడీ రద్దుని రద్దు చేసింది. నూతనంగా ఎన్నికైన రెజ్లింగ్‌ బాడీని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సస్పెండ్ చేసింది. WFI అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. WFIకి 10 పాయింట్లతో కూడిన నోటీస్‌‌ను కేంద్రం పంపింది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేంద్రం వేటు వేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న...బ్రిజ్‌భూషణ్‌ సన్నిహితుడు సంజయ్‌ సింగ్‌, WFI అధ్యక్షుడు కావడం పట్ల రెజ్లర్ల నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల WFI అధ్యక్ష ఎన్నికల అనంతరం రెజ్లింగ్‌ నుంచి సాక్షి మాలిక్‌ తప్పుకుంది. పద్మశ్రీని సైతం బజ్‌రంగ్ పునియా తిరిగిచ్చేసింది.

Tags:    

Similar News