Adam Gilchrist: బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో గిల్‌క్రిస్ట్‌ సంచలన వ్యాఖ్యలు

Adam Gilchrist: 2018లో ద‌క్షిణాఫ్రికాపై జ‌రిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు బాల్ టాంప‌రింగ్ చేసిన‌ ఉదంతం పెద్ద దుమార‌మే రేగింది.

Update: 2021-05-17 17:20 GMT

గిల్‌క్రిస్ట్ ఫైల్ ఫోటో 

Adam Gilchrist: ద‌క్షిణాఫ్రికాపై 2018లో జ‌రిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు బాల్ టాంప‌రింగ్  చేసిన‌ ఉదంతం పెద్ద దుమార‌మే రేగింది. ఈ వివాదంలో బాన్‌క్రాఫ్ట్‌తోపాటు నాటి జట్టు కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ విష‌యాన్ని ఆసీస్ దిగ్గ‌జ‌ ఆటగాడు గిల్‌క్రిస్ట్ తెర‌పైకి తేచ్చాడు. బాల్‌ టాంపరింగ్‌ జరిగిన విషయం బాన్‌క్రాఫ్ట్‌తో పాటు మరికొంత మందికి ముందే తెలుసని, ఆ పేర్లను బయటపెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మూడేళ్ల కిందట జరిగిన బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తుంది.

ఈ విషయమై తొలుత మరోవైపు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ క్లార్క్‌ స్పందిస్తూ బాల్‌ టాంపరింగ్‌ జరిగిన విషయం ఆ ముగ్గురితో పాటు ఇంకా ఎవరికైనా ముందే తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. బాన్‌క్రాఫ్ట్‌ మాట్లాడుతూ.. 2018లో సఫారీలతో జరిగిన మూడో టెస్ట్‌లో తాను సాండ్‌ పేపర్‌ వాడిన విషయం తమ బౌలర్లకు ముందే తెలుసని బాంబు పేల్చాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియాను ఓ కుదుపునకు లోను చేసిన ఈ ఉదంతంపై వార్నర్‌ మేనేజర్‌ జేమ్స్‌ మాట్లాడుతూ.. నాడు జరిగిన విచారణ ఏకపక్షంగా సాగిందని, ఈ విషయమై నిషేదానికి గరైన ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించి ఉంటే తప్పక కేసు గెలిచే వాళ్లని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Tags:    

Similar News