గుండె పోటుతో రింగ్‌లోనే ప్రాణాలు విడిచిన బాక్సర్
Heart Attack: బాక్సింగ్ లోకం మరో మేటి స్టార్‌ను కోల్పోయింది.
Heart Attack: బాక్సింగ్ లోకం మరో మేటి స్టార్‌ను కోల్పోయింది. జర్మనీ ఛాంపియన్ ముసా యామక్ రింగులో గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. మునిచ్‌లో జరిగిన బౌట్‌లో 38 ఏళ్ల స్టార్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఉగాండాకు చెందిన హమ్జా వండెరాతో జరుగుతున్న మ్యాచ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ను లైవ్‌లో స్ట్రీమింగ్ చేస్తుండగా బాక్సర్ ముసా మరణించాడు.
యురోపియన్, ఏషియన చాంపియన్ షిప్‌లను అతను గెలిచినట్లు టర్కీ అధికారి ప్రకటించారు. మ్యాచ్ 3వ రౌండ్ ఆరంభంలో బాక్సర్ ముసా కుప్పకూలాడు. రెండో రౌండ్‌లో వండెరా భారీ పంచ్‌తో ముసాకు ముచ్చెమటలు పట్టించాడు. రింగ్ దగ్గరకు వైద్యులు చేరుకున్నా అప్పటికే బాక్సర్ ముసా ప్రాణాలు కోల్పోయాడు. టర్కీలో పుట్టిన ముసా యామక 2017లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాడు.