IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. ఫాస్ట్ బౌలర్ ఆటకు దూరం

IPL 2024: తొడకండరాల గాయంతో బాధ పడుతున్న మధుశంక

Update: 2024-03-17 12:20 GMT

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. ఫాస్ట్ బౌలర్ ఆటకు దూరం 

IPL 2024: ఐపీఎల్-2024 ‎‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు ఊహించని షాక్ తగిలింది. జట్టు స్టార్ పేసర్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ ఫస్ట్‌ హాఫ్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. మధుశంక ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధ పడుతున్నాడు. ఛటో గ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే‌లో గాయపడ్డ మధుశంక... ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఐపీఎల్‌-2024లో మధుశంకను ముంబై ఇండియన్స్‌ 4కోట్ల 60లక్షల ధరకు కొనుగోలు చేసింది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌-2023లో మధుశంక అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో ముంబై ప్రాంచైజీ అతడిని తమ జట్టులోకి తీసుకుంది.

Tags:    

Similar News