India vs Sri Lanka T20: మెరిసిన భువనేశ్వర్.. మురిసిన భారత్
* శ్రీలంక ఇండియా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం * భారత్ 20 ఓవర్లలో 164/5 *శ్రీలంక 18.3 ఓవర్లలో 126
India vs Sri Lanka T20: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం శ్రీలంక ఇండియా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక భారత్ ని మాత్రం మ్యాచ్ ఓడించలేక భారత బౌలర్స్ దాటికి చతికిలపడింది. మొదటగా బ్యాటింగ్ కి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50)హాఫ్ సెంచరీతో శిఖర్ ధావన్(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) పరుగులతో మినహా బ్యాటింగ్ ఎవరు చెప్పుకోదగ్గగా రాణించలేదు.
ఇక 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఆటగాళ్ళలో చరిత్ అసలంక(44), అవిష్కా ఫెర్నాండో(26) మినహా భారత బౌలింగ్ దాటికి అందరు బ్యాటింగ్ లో విఫలమవడంతో శ్రీలంక 18.3 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలడంతో 38 పరుగులతో టీంఇండియా అలవోకగా మొదటి టీ 20 మ్యాచ్ ని గెలుపొందింది. ఇక భారత బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ (4/22) నాలుగు వికెట్లతో పాటు దీపక్ చాహర్(2/24) రెండు, వరుణ్ చక్రవర్తీ(1/28), యుజ్వేంద్ర చాహల్(1/19), హార్దిక్ పాండ్యా(1/17), కృనాల్ పాండ్యా(1/16) తో భారత బౌలర్స్ అంతా విజయానికి సమిష్టిగా కృషి చేశారు. నాలుగు వికెట్లను పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.