Bhuvneshwar Kumar - No Ball: 6 ఏళ్ళ తర్వాత భువనేశ్వర్ కుమార్ "నో బాల్"

Update: 2021-07-20 11:21 GMT

భువనేశ్వర్ కుమార్ (ఫైల్ ఫోటో )

India Vs Sri Lanka 2021 - Bhuvaneshwar Kumar: భువనేశ్వర్ కుమార్ భారత బౌలింగ్ లో గత 8 ఏళ్ళుగా స్థిరమైన తన బౌలింగ్ ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. శ్రీనాథ్, జహీర్ ఖాన్ వంటి లెజెండరీ బౌలర్స్ తర్వాత భారత జట్టులో ఎక్కువ కాలం ఉన్న ఏకైక బౌలర్ భువనేశ్వర్ కుమార్. అయితే మంగళవారం శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డే లో టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకోగా భారత్ బౌలింగ్ కి దిగింది. ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ తన అయిదవ ఓవర్లో నో బాల్ వేశాడు. అయితే ఈ నో బాల్ కి ఒక ప్రత్యేకత ఉంది. 2015 అక్టోబర్ లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో నో బాల్ వేసిన భువనేశ్వర్ కుమార్ దాదాపుగా 6 ఏళ్ళ తర్వాత మంగళవారం జరుగుతున్న శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డే లో నో బాల్ వేశాడు.

సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో నో బాల్ వేసిన భువనేశ్వర్ కుమార్ 3903 బాల్స్ తర్వాత ఈ రోజు మరో నో బాల్ వేశాడు. ఇప్పటివరకు తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో 31 ఏళ్ళ భువనేశ్వర్ కుమార్ కేవలం 5 నో బాల్స్ వేయడం క్రికెట్ చరిత్రలో రికార్డు అని క్రికెట్ పండితులు చెప్పుకొచ్చారు. ఇక తన బౌలింగ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్టుకి ముచ్చెమటలు పట్టించే భువనేశ్వర్ తన కెరీర్లో కూడా తక్కువ ఎకానమీ తో భారత జట్టుకు ఎన్నో మరువలేని విజయాలను అందించాడు. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్ లో భువనేశ్వర్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. ఆరు ఏళ్ళ తర్వాత రోజు భువనేశ్వర్ వేసిన నో బాల్ ప్రస్తుతం ఇంటర్ నెట్ లో హల్చల్ చేస్తుంది.   

Tags:    

Similar News