Rajiv Gandhi Khel Ratna: ఖేల్ రత్నకు అశ్విన్, మిథాలీ పేర్లు
Khel Ratna: రాజీవ్ ఖేల్‌రత్నకు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మహిళల వన్డే, టెస్టు సారథి మిథాలీ రాజ్ పేర్లను బీసీసీఐ సిఫార్సు చేసింది.
Rajiv Gandhi Khel Ratna: క్రీడాకారులు ప్రతిష్టాత్మకంగా భావించే క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. ఈ అవార్డు కోసం ఇద్దరు బరిలో నిలిచారు. పురుషుల జట్టు నుంచి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మహిళల టీం నుంచి మిథాలీ రాజ్ బరిలో నిలిచినట్లు బీసీసీఐ పేర్కొంది. జూన్ 21తో ముగిసిన గడువును పొడిగించడంతో జాబితాలు సిద్ధం చేస్తున్నాయి. బీసీసీఐ, ఫుట్‌బాల్, రెజ్లింగ్ ఇతర సంఘాలు ఇప్పటికే కొందరి పేర్లను ప్రస్తావించాయి.
సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 79 టెస్టుల్లో 413, వన్డేల్లో 150, టీ20ల్లో 42 వికెట్లు తీశాడు. జట్టు విజయాల్లో కీలకంగా నిలుస్తున్నాడు. శ్రీలంక పర్యటనలో భారత్‌కు సారథ్యం వహిస్తున్న శిఖర్ ధావన్ పేరును మళ్లీ పంపించారు. గతేడాది అతడిని పురస్కారం వరించలేదు. బుమ్రా, రాహుల్ అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్నారు.
మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లో 22 సంవత్సరాలను ఇటీవలే పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 1999 జూన్ 26న ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. మహిళల క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్ కూడా మిథాలీ రాజ్ అగ్రస్థానంలో నిలిచారు. 216 మ్యాచులాడి 7170 పరుగులు చేశారు. భారత్ తరఫున 11 టెస్టులు, 215 వన్డేలు, 89 టీ20లు ఆడారు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళలు పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడుతున్నారు. మొదటి వన్డేలో ఓడిపోయిన టీమిండియా, రెండో వన్డేలో నేటి సాయంత్రం తలపడనుంది.